• Home »
  • BARC »
  • వచ్చే వారం నుంచే గ్రామీణ ప్రేక్షకాదరణ ఫలితాలు: బార్క్ సమాచారం మీద ఉత్కంఠ

వచ్చే వారం నుంచే గ్రామీణ ప్రేక్షకాదరణ ఫలితాలు: బార్క్ సమాచారం మీద ఉత్కంఠ

భారతదేశంలో టీవీ ప్రేక్షకాదరణ లెక్కించే బ్రాడ్ కాస్ట్ ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్ ( బార్క్ ) ఎటకేలకు గ్రామీణ ప్రేక్షకాదరణ సమాచారాన్ని కూడా ఇవ్వబోతోంది. ఇప్పటివరకూ లక్శ్జలోపు జనాభా ఉన్న పట్టణలను, గ్రామాలను లెక్కలోకి తీసుకొకపోవటం వలన సగం మంది ప్రేక్షకుల అభిప్రాయాలకు తావులేకుండా పోయిందన్న విమర్శ ఉన్న సంగతి తెలిసిందే. టామ్ కు ప్రత్యామ్నాయంగా వచ్చిన బార్క్ ఆ లోటు భర్తీ చేస్తానని కొంత కాలంగా చెబుతూ ఉండగా వచ్చేవారమే గ్రామీణ ప్రేక్షకాదరణ డేటా ఇవ్వబోతున్నట్టు బార్క్ వెల్లడించింది.

ఇప్పటివరకూ 7 కోట్ల 75 లక్ష్జల పట్టణప్రాంత ఇళ్ళనుంచి శాంపిల్స్ సేకరించగా తాజా డేటా లో మరో 7 కోట్ల 60 లక్షలగ్రామీణ ప్రేక్షకుల ఇళ్ళు కూడా చేరుతున్నాయి. దాదాపు రెండూ సమానమైన శాంపిల్స్ తీస్తిఊ ఉండటం వలన వాస్తవ పరిస్థితి ప్రతిబింబిస్తుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. టామ్ తో ఈ మధ్యనే ఒప్పందం కుదుర్చుకొని వారి మీటర్లు కూడా వాడుకోబోతున్న బార్క్ ఇవ్వబోయే ఫలితాలమీద టీవీ పరిశ్రమలో ఉత్కంఠ నెలకొంది.