• Home »
  • Books »
  • రేపు హైదరాబాద్ హైటెక్స్ లో ’కేబుల్ టీవీ డిజిటైజేషన్’ పుస్తకావిష్కరణ

రేపు హైదరాబాద్ హైటెక్స్ లో ’కేబుల్ టీవీ డిజిటైజేషన్’ పుస్తకావిష్కరణ

కేబుల్ టీవీ రంగం డిజిటైజేషన్ క్రమంలో ఇప్పుడు అత్యంత కీలకమైన మలుపు తిరుగుతున్న సందర్భంగా ఈ ప్రక్రియకు సంబంధించిన  సమాచారాన్ని తెలుగు టీవీ డాట్ ఇన్ఫో వెబ్ సైట్ ఎప్పటికప్పుడు అందిస్తూ వస్తోంది.  అయితే ఆ సమాచారాన్నంతా ఒకచోట చేర్చి, ఈ రంగంలో ఉన్నవారందరూ సులభంగా చదువుకోవటానికి వీలుగా ఒక పుస్తక రూపంలో తీసుకు వచ్చే ప్రయత్నమే ’ కేబుల్ టీవీ డిజిటైజేషన్’ .

తెలుగు టీవీ డాట్ ఇన్ఫో సంపాదకుడు తోట భావనారాయణ రాసిన ఈ 300 పేజీల పుస్తకాన్ని రేపు (24న) హైటెక్స్ లో జరిగే కేబుల్ ఎక్స్ పో సందర్భంగా మంత్రి తారకరామారావు ఆవిష్కరిస్తారు. రెండు తెలుగు రాష్ట్రాలనుంచి వస్తున్న కేబుల్ ఆపరేటర్లు, ఎమ్మెస్వోలు, సాంకేతిక సిబ్బంది తరలి వస్తున్న సమయంలో ఈ ప్రదర్శన సందర్భంగా కేబుల్ సమాచార్ చందాదారులకు ప్రత్యేకంగా ఈ పుస్తకం అందుబాటులో ఉంటుంది.

కేబుల్ టీవీ  పరిణామ క్రమం, డిజిటైజేషన్ చట్టం, అమలు తీరు తెన్నులు, ఎమ్మెస్వో లైసెన్స్ పొందే పద్ధతి, హెడ్ ఎండ్, సెట్ టాప్ బాక్స్, కాస్ లాంటి సాంకేతిక అంశాల వివరణ, పే చానల్స్ పేరుతో బ్రాడ్ కాస్టర్ల పెత్తనం, బ్రాడ్ కాస్టర్ తో ఎమ్మెస్వో ఒప్పందాలు, ఎమ్మెస్వోకూ, ఆపరేటర్ కూ మధ్య ఒప్పందాలు, వాటి నమూనాలు, చిన్న ఎమ్మెస్వోల సమస్యలు, డిటిహెచ్, హిట్స్ పనిచేసే విధానం, వాటితో పోటీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిన ట్రిపుల్ ప్లే మీద విశ్లేషణ, డిజిటల్ కేబుల్ చందాదారుల హక్కులు సహా అనేక అంశాలు ఈ పుస్తకంలో ఉన్నాయి.