• Home »
  • Cable »
  • 18న తెలంగాణలో బ్రైట్ వే కమ్యూనికేషన్స్ డిజిటల్ కేబుల్ సర్వీసుల ప్రారంభం

18న తెలంగాణలో బ్రైట్ వే కమ్యూనికేషన్స్ డిజిటల్ కేబుల్ సర్వీసుల ప్రారంభం

తెలంగాణ అంతటా డిజిటల్ కేబుల్ టీవీ ప్రసారాలందించేందుకు బ్రైట్ వే సిద్ధం చేసిన అత్యాధునిక డిజిటల్ హెడ్ ఎండ్ ఈ నెల 18 న ప్రారంభమవుతోంది. ఎమ్మెస్వోలు వాటాదారులుగా ఉండి కలసికట్టుగా ఏర్పాటుచేసుకున్న ఈ హెడ్ ఎండ్ కోసం సాంకేతికంగా పేరుమోసిన అనేక సంస్థలు అంతర్జాతీయ ప్రమాణాలతో సాంకేతిక సహకారాన్నందించాయి. 18న (ఆదివారం) మధ్యాహ్నం 12.30 కి మొదలయ్యే ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో నీటి పారుదల, మైనింగ్,మార్కెటింగ్, శాసనసభావ్యవహారాల శాఖామంత్రి హరీశ్ రావు ముఖ్య అతిథిగా, శాసనసభ ఉపసభాపతి పద్మాదేవేందర్ రెడ్డి , రవాణాశాఖామంత్రి మహేంద్ర రెడ్డి గౌరవ అతిథులుగా పాల్గొంటారు.

కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి. వివేకానందగౌడ్, కుకట్ పల్లి ఎమ్మెల్యే మాదవరం కృష్ణారావు, మేద్చెల్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, బాలానగర్ డిసిపి శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ ఎమ్మెస్వోల సంఘం గౌరవాధ్యక్షుడు కావేటి సమ్మయ్య, తెలంగాణ ఎమ్మెస్వోల సమాఖ్య అధ్యక్షుడు ఎం. సుభాష్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎ. భాస్కర్, కేబుల్ ఆపరేటర్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు రాజా గౌడ్, జిహెచ్ ఎమ్ సి, రంగారెడ్డిజిల్లాల కేబుల్ ఆపరేటర్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీహరి గౌడ్ ఆహ్వానితులుగా హాజరవుతారు.

హైదరాబాద్ కొంపల్లి లోని చంద్రా గార్డెన్స్ లో జరిగే ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కె. నవీన్ కుమార్, ఎం. సుభాష్ రెడ్డి, పి. జైపాల్, ఎ. సూర్యనారాయణ, మొహమ్మద్ మౌలా తోబాటు బ్రైట్ వే బృందం విజ్ఞప్తిచేస్తోంది.