• Home »
  • Broadband »
  • చెన్నైలో 17 నుంచి బ్రాడ్ కాస్ట్ ఎగ్జిబిషన్

చెన్నైలో 17 నుంచి బ్రాడ్ కాస్ట్ ఎగ్జిబిషన్

నిరుడు జరిపిన మొదటి అంతర్జాతీయ ప్రదర్శన విజయవంతం కావటంతో ఆలిండియా బ్రాడ్ కాస్ట్ మాన్యుఫాక్చరర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ (AIBMDA) ఇప్పుడు వరుసగా రెండో విడత కూడా చెన్నైలో ఈ ప్రదర్శన జరపాలని నిర్ణయించింది. ఈ నెల 17 నుంచి రెండురోజులపాటు జరిగే ఈ అంతర్జాతీయ ప్రదర్శనలో బ్రాడ్ కాస్ట్ పరికరాలతోబాటు సంబంధిత టెక్నాలజీని కూడా పరిచయం చేస్తారు.

ప్రపంచం నలుమూలలా బ్రాడ్ కాస్ట్ రంగం, సినిమా రంగం వాడుతున్న  అత్యాధునిక ఉత్పత్తులను, టెక్నాలజీని పరిచయం చేయటానికి ఈ వేదిక ప్రధానంగా ఉపయోగపడుతుంది. ఐపిటిఓ ఆమోదం పొందిన ఈ ప్రదర్శనకు ప్రసార భారతి, ఆడియో ఇంజనీరింగ్ సొసైటీ ఆఫ్ ఇండియా తో బాటు అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థలు మద్దతునిస్తున్నాయి.

సిడిఎం టెక్నాలజీస్, కెనరా లైటింగ్, కామ్ కాన్ టెక్నాలజీస్, డాటాప్రో ఇంపెక్స్, డిజిటల్ బ్రాడ్ కాస్ట్ ఇండియా, డిజిటల్ సొల్యూషన్స్, ఫాల్కన్ టెక్నాలజీస్, హన్సా సినీ ఎక్విప్ మెంట్, హర్మాన్ ఇంటర్నేషనల్, హైటెక్ కమ్యూనికేషన్స్, ఐడియల్ బ్రాడ్ కాస్టింగ్, మీడియాగురు, మోడీ డిజిటల్, నెట్ వెబ్ టెక్నాలజీస్, పానాసోనిక్, ప్రణవ్ మీడియాటెక్, ప్రైమ్ టెక్ కమ్యూనికేషన్స్, రియల్ ఇమేజ్, రాస్ వీడియో, ఎస్ఆర్ ఎస్ జి బ్రాడ్ కాస్ట్, సెట్రాన్ ఇండియా, సింగ్ వరల్డ్, విజువల్ టెక్నాలజీస్ ఇండియా లాంట పేరుమోసిన సంస్థలు ఇప్పటికే తాము పాల్గొంటున్నట్టు ధ్రువీకరించగా బెసిల్, ఎస్సెల్ శ్యామ్, బ్లాక్ మాజిక్ డిజైన్, సినీఓమ్ బ్రాడ్ కాస్ట్, డాటావీడియోలాంటి  మరికొన్ని సంస్థలు కూడా సూత్రప్రాయంగా ఆమోదం తెలియజేశాయి.

ఇది దక్షిణాదిన జరిగే అతిపెద్ద బ్రాడ్ కాస్ట్ అండ్ మీడియా టెక్నాలజీ ప్రదర్శన అని  ఎఐబిఎండిఎ  కార్యదర్శి ఎస్ సి ఒబెరాయ్ అభివర్ణిస్తున్నారు. బ్రాడ్ కాస్ట్ సినీ రంగాల్లో పనిచేసే ఉద్ధండులను ఆహ్వానిస్తున్నట్టు కూడా చెప్పారాయన. హైదరాబాద్, బెంగళూరు, కొచ్చి, తిరువనంతపురం నుంచి ఆలిండియారేడియో, దూరదర్శన్ నిపుణులు చాలామంది హాజరవుతున్నారని కూడా వెల్లడించారు.