• Home »
  • Digitisation »
  • బ్రాడ్ కాస్టర్, ఎమ్మెస్వో మధ్య ఒప్పందం తప్పనిసరి చేసిన ట్రాయ్

బ్రాడ్ కాస్టర్, ఎమ్మెస్వో మధ్య ఒప్పందం తప్పనిసరి చేసిన ట్రాయ్

పలువురు ఎమ్మెస్వోలు, ఆపరేటర్లు ఎలాంటి ఒప్పందాలూ లేకుండానే సిగ్నల్స్ ప్రసారం చేస్తున్నట్టు ప్రభుత్వం దృష్టికి రావటంతో ఇంటర్ కనెక్ట్ ఒప్పందాలు తప్పనిసరి చేస్తూ టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ( ట్రాయ్ ) ఆదేశాలు జారీచేసింది. బ్రాడ్ కాస్టర్ కు ఎమ్మెస్వో చందా చెల్లించినా, చెల్లించకపోయినా లిఖితపూర్వక ఒప్పందాలు తప్పనిసరి అని ఆ ఆదేశాలలో స్పష్టం చేసింది.

ప్రస్తుతం అమలులో ఉన్న ఒప్పందం గడువు పూర్తి కావటానికి 60 రోజులు ముందుగానే కొత్త ఒప్పందం చేసుకోవచ్చునని కూడా అందులో పేర్కొంది.ఈ మేరకు పాత నిబంధనలను సవరించింది. ఇకమీదట పరస్పర బేరసారాల ద్వారా ఒక అవగాహనకు వచ్చినట్టు చెప్పుకోవటం కుదరదు. ఎలాంటి మౌఖిక ఒప్పందాలకూ తావు లేదు. ఒకవేళ అలాంటి ఒప్పందమేదీ కుదుర్చుకోకపోతే ఎమ్మెస్వోలు తప్పనిసరిగా అవిషయాన్ని చందాదారులకు తెలియజేయాల్సి ఉంటుంది.