• Home »
  • Cable »
  • డిజిటల్ ఇండియా ప్రధానాంశంగా CASBAA ఇండియా ఫోరం – 2016

డిజిటల్ ఇండియా ప్రధానాంశంగా CASBAA ఇండియా ఫోరం – 2016

ఈ నెల 22న జరిగే కాస్బా సదస్సులో ఇండియా ఫోరం 2016 లో భాగంగా డిజిటల్ ఇండియా మీద దృష్టి సారించి చర్చించబోతున్నారు. డిజిటైజేషన్ నేపథ్యంలో భారత బ్రాడ్ కాస్టింగ్ రంగంలో వేగంగా వస్తున్న మార్పులమీద చర్చ జరుగుతుంది. ఈ ఏడాది భారత ఆర్థిక వ్యవస్థలో కీలకమార్పులకు కారణమవుతున్నందువల్లనే డిజిటల్ ఇండియా ను అంశంగా ఎంచుకున్నట్టు కాస్బా సీఈవో క్రిస్టొఫర్ స్లాటర్ చెప్పారు.

ఈ ఏడాది సదస్సులో పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ప్రసంగిస్తారు. ట్రాయ్ చైర్మన్ ఆర్ ఎస్ శర్మ కీలకోపన్యాసం చేస్తారు. సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ ప్రత్యేక కార్యదర్శి జె ఎస్ మాథుర్ ప్రారంభోపన్యాసం చేస్తారు. ఇంకా టాటా స్కై ఎండీ హరిత్ నాగ్ పాల్, ట్రాయ్ ప్రెఇన్సిపల్ అడ్వైజర్ ఎస్ కె గుప్తా, ఎం ఐ బి జాయింట్ సెక్రెటరీ ఆర్. జయ, బిబిసి గ్లోబల్ న్యూస్ సీవోవో నవీన్ ఝంఝన్ వాలా, డిస్నీ వైస్ ప్రెసిడెంట్ నిఖిల్ గాంధీ, హాత్ వే సీఈవో జగదీష్ కుమార్, హిందుజా గ్రూప్ సీఈవో డిసిల్వా తదితరులు ప్రసంగిస్తారు