• Home »
  • Advertisement Code »
  • తప్పుదారి పట్టించే ప్రకటనల్లో నటిస్తే ఐదేళ్ళ జైలు శిక్ష: దివాకర్ రెడ్డి కమిటీ

తప్పుదారి పట్టించే ప్రకటనల్లో నటిస్తే ఐదేళ్ళ జైలు శిక్ష: దివాకర్ రెడ్డి కమిటీ

సెలెబ్రిటీల ఎండార్స్ మెంట్ ఆదాయానికి గండిపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. డబ్బిస్తున్నారని ఎలాంటి ప్రకటనల్లోనైనా నటించటానికి అభ్యంతరం లేదనుకునేవాళ్ళ అత్యాశకు బ్రేక్ పడబోతోంది. పార్లమెంటరీ కమిటీ ఇచ్చిన నివేదికను కేంద్రం ఆమోదిస్తే ఇదే పరిస్థితి ఎదురవుతుంది. తప్పుదారి పట్టించే ప్రకటనలలో నటించే సెలెబ్రిటీలమీద కఠిన చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం ఎంపీ జెసి దివాకర్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటైన వినియీగదారుల వ్యవహారాల పార్లమెంటరీ కమిటీ తన నివేదికలో ప్రభుత్వానికి సిఫార్సు చేసింది.

ఒక ప్రకటనలో చెప్పిన విషయం అబద్ధమని తేలిన పక్షంలో ఆ సెలెబ్రిటీకి ఐదేళ్ళ జైలు శిక్షతోబాటు 50 లక్షల జరిమానా విధించాలని సూచించింది. ఈ ప్రతిపాదనలన్నిటినీ కమిటీ ఏకగ్రీవంగా ఆమోదించి ప్రభుత్వానికి పంపింది. భారత  క్రికెట్ జట్టు కెప్టెన్ ఎం ఎస్ ధోనీ బ్రాండ్ అంబాసడర్ గా ఉన్న నోయిడా గృహనిర్మాణ ప్రాజెక్ట్ ఆమ్రపాలి సఫైర్ ఫ్లాట్ యజమానులు చేస్తున్న పోరాటానికి ఈ నివేదిక పెద్ద వరంలా మారబోతోంది.