• Home »
  • Advertisement Code »
  • తప్పుదారి పట్టించే ప్రకటనల్లో నటించే సెలెబ్రిటీకి ఐదేళ్ళ జైలు, 50లక్షల ఫైన్

తప్పుదారి పట్టించే ప్రకటనల్లో నటించే సెలెబ్రిటీకి ఐదేళ్ళ జైలు, 50లక్షల ఫైన్

సెలెబ్రిటీలు ఎవరైనా సరే ఏవైనా ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తే వారే పూర్తి బాధ్యత వహించేలా ప్రభుత్వం చట్టం చేస్తోంది. ఆ ప్రకటనలు తప్పుదారి పట్టించేలా ఉన్నాయని రుజువైతే ఆ సెలెబ్రిటీకి ఐదేళ్ల జైలు శిక్ష విధించటంతోబాటు యాభైల్ లక్షలు జరిమానా విధించాలని తెలుగుదేశం ఎంపీ జెసి దివాకర్ రెడ్డి అధ్యక్షుడిగా ఉన్న పార్లమెంటరీ కమిటీ ఇచ్చిన సిఫార్సును ప్రభుత్వం ఆమోదించింది, న్యాయశాఖ నుంచి గ్రీన్ సిగ్నల్ రావటంతో వచ్చే వారమే లాంఛనంగా కాబినెట్ ఆమోదం పొందబోతోంది.

కొత్త బిల్లులోని సెక్షన్ 75బి ప్రకారం తప్పుదారి పట్టించే ప్రకటనలకు గాను మొదటి విడత అయితే రెండేళ్ళ జైలు శిక్షతోబాటు రూ. 10 లక్షల జరిమానా, రెండో విడత అయితే ఐదేళ్ళ జైలుశిక్షతోబాటు 50 లక్షల జరిమానా  విధిస్తారు. ఈ కొత్త బిల్లు ప్రకారం తన తప్పేమీ లేదని రుజువు చేసుకోవాల్సిన బాధ్యత ఆ సెలెబ్రిటీ మీదనే ఉంటుంది. సెక్షన్ 75ఎ ప్రకారం తయారీదారుడు లేదా సర్వీస్ ప్రొవైడర్ కూడా తప్పుదారి పట్టించే ప్రకటనలకు బాధ్యత వహించాల్సి ఉంటుంది. శిక్షలు, జరిమానాలు కూదా సెలెబ్రిటీతో సమానంగా వర్తిస్తాయి.