• Home »
  • Cable »
  • 22న చానల్ లైసెన్స్ దరఖాస్తుదారులతో సమావేశం

22న చానల్ లైసెన్స్ దరఖాస్తుదారులతో సమావేశం

MIB LOGO

శాటిలైట్ చానల్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకొని ఎదురుచూస్తున్నవారికి వారి దరఖాస్తు ఏ స్థాయిలో ఉందో  తెలియజెప్పి అనుమానాలు తీర్చటం కోసం సమాచార, ప్రసారాల మంత్రిత్వశాఖ ఈ నెల 22న ఢిల్లీలో ఒక  సమావేశం ఏర్పాటు చేసింది. దరఖాస్తు చేసుకున్న సంస్థలు తమ అధీకృత ప్రతినిధులను పంపాలని కోరుతూ  మంత్రిత్వశాఖ ఒక సర్క్యులర్ జారీచేసింది.  శాస్త్రి భవన్ లో ఈ సమావేశం జరుగుతుంది.

గతంలోనూ ఇలాంటి సమావేశాలు జరిపినప్పటికీ మధ్యలో కొంత అంతరాయం ఏర్పడింది. ఇకమీదట ప్రతినెలా 20  వ తేదీ ఈ సమావేశాలు జరుగుతాయని, అది సెలవు రోజు అయిన పక్షంలో ఆ తరువాత వచ్చే పనిదినం రోజు అరుగుతుందని మంత్రిత్వశాఖ ప్రకటించింది. ఇదే తరహాలో డిజిటల్ ఎమ్మెస్వో దరఖాస్తుదారులకోసం, టెలిపోర్ట్ ఆపరేటర్ దరఖాస్తుదారులకోసం కూడా సమావేశాలు జరుపుతున్నట్టు వెల్లడించింది.

దాదాపు 200 దరఖాస్తులు శాటిలైట్ చానల్ లైసెన్స్ కోసం ఎదురుచూస్తుండగా 22న జరిగే సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. హోం శాఖ నుంచి సెక్యూరిటీ క్లియరెన్స్ రావటంలో జరుగుతున్న ఆలస్యం వల్లనే లైసెన్సుల జారీలో ఆలస్యం జరుగుతున్నట్టు మంత్రిత్వశాఖ పదే పదే చెబుతూ వస్తోంది. అయితే, డిజితల్ ఎమ్మెస్వోలకు తాత్కాలైక లైసెన్సులు ఇవ్వాలని నిర్ణయించటంతో హోంశాఖ పనిభారం కొంత తగ్గి, శాటిలైట్ చానల్స్ పెండింగ్ దరఖాస్తులమీద దృష్టిపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.