• Home »
  • Broadband »
  • తెలుగు సహా 3 ప్రాంతీయ భాషల్లో యుట్యూబ్ చానల్ ’చు చు టీవీ’

తెలుగు సహా 3 ప్రాంతీయ భాషల్లో యుట్యూబ్ చానల్ ’చు చు టీవీ’

పిల్లలకోసం యూట్యూబ్ లో యానిమేటెడ్ చానల్ నడిపే చు చు టీవీ తన పరిధిని మరింతగా విస్తరించాలనుకుంటోంది. చెన్నై కి చెందిన ఈ సంస్థ ఇప్పటివరకు తన ప్రసారాలను ఇంగ్లీష్, స్పానిష్, పోర్చుగీస్  కే పరిమితం చేయగా ఈ ఆర్థిక సంవత్సరంలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వేరువేరుగా చానల్స్ నడపాలని నిర్ణయించుకుంది. యు ట్యూబ్ లో ఆసియా ఖండంలోనే అత్యధికంగా చూసే చానల్ గా పేరు తెచ్చుకున్నదని చు చు టీవీ  సీఈవో వినోద్ చంద్ర చెబుతున్నారు.

40 లక్షలమంది చందాదారులతో 450 కోట్ల వ్యూస్ నమోదు కాగా వాటిలో 25 శాతం అమెరికానుంచి,15శాతం భారత్ నుంచి, 10-12 శాతం బ్రిటన్ నుంచి ఉన్నాయని ఫిలిప్పైన్స్, వియత్నాం వీక్షకులు 8 శాతం చొప్పున ఉన్నారని, పశ్చిమాసియా దేశాలవారు 15 శాతం ఉన్నారని వినోద్ చంద్ర చెబుతున్నారు. విస్తరణలో భాగంగా సంస్థ సిబ్బందిని 60 నుంచి 240 కి పెంచబోతున్నట్టు 3డి కార్యక్రమాలు కూడా రూపొందించబోతున్నట్టు చెప్పారు.