• Home »
  • Cable »
  • సెట్ టాప్ బాక్సుల వ్యాపారం అమ్మేసిన సిస్కో

సెట్ టాప్ బాక్సుల వ్యాపారం అమ్మేసిన సిస్కో

సెట్ టాప్ బాక్సుల తయారీలో నాణ్యతా ప్రమాణాలకు పేరు మోసిన సిస్కో ఆ వ్యాపారాని టెక్నీకలర్ సంస్థకు అమ్మేసింది. కొంత నగదు, కొంత షేర్ల రూపంలో కలిపి మొత్తం 60 కోట్ల డాలర్లకు అమ్మకపు ఒప్పందం కుదిరింది. దీంతో బాటే టెక్నీ కలర్, సిస్కో ఒక వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం కూడా కుదుర్చుకున్నాయి. 45కోట్ల  డాలర్లు నగదు రూపంలోనూ 15 కోట్ల డాలర్లు వాటాల రూపంలోనూ ఇస్తారు

దీని వలన రెండు కంపెనీలూ అత్యాధునిక పరిజ్ఞానంతో వీడియో, బ్రాడ్ బాండ్ టెక్నాలజీల మీద దృష్టి సారిస్తున్నాయి. ఉమ్మడిహ ఇద్దరి బలాల వల్ల అదనపు ప్రయోజనాలుంటాయని సిస్కో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ హిల్టన్ రోమన్ స్కీ , టెక్నికలర్ సీఈవో ఫ్రెడెరిక్ రోజ్ అభిప్రాయపడ్డారు. ఈ ఒప్పందంలో భాగంగా హిల్టన్ ఇకమీదట టెక్నికలర్ డైరెక్టర్ల బోర్డులో ఉంటారు.