• Home »
  • Broadband »
  • ఫైబర్ నెట్ ప్రాజెక్టులో సిస్కో సహకారం: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందం

ఫైబర్ నెట్ ప్రాజెక్టులో సిస్కో సహకారం: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందం

ఆంధ్రప్రదేశ్ లో డిజిటల్ విప్లవాన్ని వేగవంతం చేయటానికి రాష్ట్ర ప్రభుత్వంతో సిస్కో సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా తిరుపతిలో టెక్నాలజీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, రీసెర్చ్ లాబ్ ఏర్పాటు చేస్తుంది. సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్స్ తయారీకి ఈ కేంద్రాన్ని వాడుకుంటుంది. అదే విధంగా విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో కూడా ఒక పరిశోధనాకార్యక్రమానికి ప్రోత్సహించి గ్రామీణ ప్రాంతాలకోసం డిజిటల్ టెక్నాలజీలను మరింత సరళతరం చేయటానికి సహకరిస్తుంది.

విశాఖలో ఎపి ఫైబర్ నెట్ ప్రారంభ కార్యక్రమం సందర్భంగా ఈ ఒప్పందం మీద సంతకాలు జరిగాయి. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమక్షంలో సిస్కో ఎగ్జిక్యుటివ్ చైర్మన్ జాన్ చాంబర్స్, సిస్కో ఏషియా పసిఫిక్ ప్రెసిడెంట్ ఇర్వింగ్ టాన్, సిస్కో ఇండియా, సార్క్ ప్రెసిడెంట్ దినేశ్ మల్కని సంతకాలు చేశారు. ఇందులో భాగంగా తిరుపతిలో రీసెర్చ్ లాబ్ ఏర్పాటు, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో 12 నెలల పరిశోధనాకార్యక్రమానికి అండగా ఉండటం, వచ్చే మూడేళ్ళలో 70 కాలేజీలలో సుమారు 10 వేలమంది విద్యార్థులకు సిస్కో నెట్ వర్కింగ్ అకాడెమీ ద్వారా శిక్షణ ఇవ్వటం లాంటి కార్యకలాపాలున్నాయి.