• Home »
  • Broadband »
  • ఏప్రిల్ 21, 22 తేదీల్లో ముంబయ్ లో క్లిక్ ఏషియా-2016 సదస్సు

ఏప్రిల్ 21, 22 తేదీల్లో ముంబయ్ లో క్లిక్ ఏషియా-2016 సదస్సు

చాలా సంస్థల్లో సవతి తల్లి ప్రేమకు గురవుతున్న  డిజిటల్ కు ఇప్పుడు అందరూ అత్యంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన సమయం వచ్చిందని క్లిక్ మీడియా భావిస్తోంది. డిజిటల్ పరిణామక్రమాన్ని, మార్కెటింగ్ అవకాశాలను ఒకచోట చేర్చే లక్ష్యంతో అంతర్జాతీయ పేరు ప్రఖ్యాతులు పొందినవారిని ఆహ్వానించి క్లిక్ ఏషియా 2016 సదస్సు నిర్వహిస్తున్నట్టు సంస్థ డైరెక్టర్ కవితా ఝంఝన్ వాలా చెప్పారు. వేగంగా లక్ష్యాలు సాధించాలనుకునేవారి నెట్ వర్కింగ్ కు ఈ సదస్సు బాగా ఉపయోగపడుతుందన్నారు.

ఈ సదస్సులో ప్రధానంగా డిజిటల్ మార్కెటింగ్ లో కొత్త వ్యూహాలు, కొత్త ఉత్పత్తుల గురించి తెలుసుకోవటానికి వీలవుతుంది. ఈ సందర్భంగా ప్రసంగాలు, బహిరంగ సమావేశాలు, వర్క్ షాపులు  జరుగుతాయి. డిజిటల్ మార్కెటింగ్ నిపుణులు, బ్రాండ్ మేనేజర్లు, ఏజెన్సీ అధిపతులు, స్టార్టప్ వ్యవస్థాపకులు వెంచర్ కాపిటలిస్టులు పాల్గొంటారు.