• Home »
  • Entertainment »
  • టాప్ టెన్ హిందీ కార్యక్రమాల్లో సగం కలర్స్ చానల్ వే

టాప్ టెన్ హిందీ కార్యక్రమాల్లో సగం కలర్స్ చానల్ వే

అక్టోబర్ 4-1- తేదీల మధ్య 41వ వారానికి టామ్ అందించిన సమాచారం ప్రకారం హిందీ చానల్స్ లో టాప్ టెన్ కార్యక్రమాలలో సగం కలర్స్ టీవీ కార్యక్రమాలు ఆక్రమించుకున్నాయి. స్వరాగిణి తిరిగి నెంబర్ వన్ స్థానం దక్కించుకోగా అంతకు ముందు వారం నెంబర్ వన్ స్థానంలో ఉన్న దియా ఔర్ .. సీరియల్ ఏడో స్థానానికి వెళ్ళింది.

ఏ రిష్టా క్యా కహ్లాతా హై ఈ వారంలో టాప్ టెన్ లో స్థానం సంపాదించుకుంది. మొత్తం టాప్ టెన్ లో కలర్స్ కు ఐదు స్థానాలు దక్కగా స్టార్ ప్లస్ కు నాలుగు స్థానాలు దక్కాయి. జీ టీవీకి ఒకే ఒక అవకాశం దక్కింది.

కలర్స్ లో ప్రసారమయ్యే చక్రవర్తిన్ అశోక్ సమ్రాట్ కు రెండో స్థానం, ఉడాన్ కు మూడో స్థానం లభించాయి. స్టార్ ప్లస్ కార్యక్రమాల్లో మొదటి స్థానం, మొత్తంలో నాలుగో స్థానం సాథ్ నిభానా సాథియాకు దక్కింది. టాప్ టెన్ లో జీ టీవీ వారి కుంకుమ్ భాగ్య 8 వ రాంకు మాత్రమే సంపాదించుకోగలిగింది