• Home »
  • Entertainment »
  • కపిల్ శర్మ షో కి పోటీగా కలర్స్ లో 23న బాజీరావ్ మస్తానీ

కపిల్ శర్మ షో కి పోటీగా కలర్స్ లో 23న బాజీరావ్ మస్తానీ

సోనీలో మళ్ళీ కపిల్ శర్మ షో తో  ఈ నెల 23 నుంచి కపిల్ శర్మ కనిపించబోతుండగా అదేరోజు ఆ సమయానికి సంజయ్ లీలా భన్సాలీ చిత్రం బాజీరావ్ మస్తానీ ప్రసారం చేయాలని కలర్స్ చానల్ నిర్ణయించుకుంది. మామూలుగా అయితే ఆ సమయానికి కామెడీ నైట్స్ బచావో ప్రసారం కావాల్సి ఉంది. అయితే, గట్టిపోటీ ఇచ్చే లక్ష్యంతో మొదటిరోజు ఈ వ్యూహం అనుసరించాలని కలర్స్ నిర్ణయించుకోవటం ఇప్పుడు మార్కెట్లో చర్చనీయాంశమైంది.

కామెడీ నైట్ విత్ కపిల్ ద్వారా పేరు సంపాదించుకున్న  కపిల్ శర్మ కలర్స్ నుంచి తప్పుకోవటంతో ఆ కార్యక్రమం స్థానంలో కృష్ణ అభిషేక్, భారతీసింగ్ పాల్గొనే కామెడీ నైట్స్ బచావో ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే. అయితే, ప్రత్యర్థి చానల్ సోనీ లో ఈ నెల 23 నుంచి కపిల్ శర్మ షో నిర్వహించటానికి కపిల్ శర్మ సిద్ధమయ్యారు. అందుకే కలర్స్ తన వ్యూహం మార్చుకొని ఆ రోజున రణవీర్ సింగ్, దీపికాపడుకొనె, ప్రియాంకా చోప్రా నటించిన బాజీరావ్ మస్తానీ ప్రసారం చేయబోతోంది.