• Home »
  • Entertainment »
  • 21 నుంచి జీ తెలుగులో సరికొత్త సెలెబ్రిటీ షో ’కామెడీ నైట్స్’

21 నుంచి జీ తెలుగులో సరికొత్త సెలెబ్రిటీ షో ’కామెడీ నైట్స్’

జీ తెలుగు మరో కొత్త కార్యక్రమం అందించటానికి సిద్ధమైంది. ప్రతి ఆది వారం ప్రైమ్ టైమ్ లో కామెడీ నైట్స్ పేరుతో ఒక సెలెబ్రిటీ షో అందించబోతోంది. నిజానికి ఈ నెల 7 న రాత్రి 9 గంటలకు ప్రీమియర్ షో ప్రసారమైనప్పటికీ 21 నుంచి అసలు కార్యక్రమం అందుబాటులోకి వస్తుంది.

జీ తెలుగు చానల్ లో పేరు మోసిన యాంకర్ జంట శ్రీముఖి, రవి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. టాలీవుడ్ సెలెబ్రిటీలు అనేక కొత్త విషయాలు ప్రేక్షకులతో పంచుకోవటం, ఇచ్చిన టాస్క్ లు పూర్తి చేయటం, ఆటలు,  కొన్ని సీన్ల స్పూఫ్ లో పాల్గొనటం లాంటివి ఆసక్తికరంగా తీర్చిదిద్దారు.

ఈ మధ్యనే పెళ్ళయిన నమిత తన భర్త వీరేంద్ర తో కలిసి పాల్గొనే మొదటి ఎపిసోడ్ లో అనేక ఆసక్తికరమైన విషయాలు చెప్పారని చానల్ నిర్వాహకులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నమిత తన పాకశాస్త్ర ప్రావీణ్యాన్ని కూడా ప్రదర్శించారంటున్నారు. 21 నుంచి ప్రతి ఆదివారం రాత్రి 9 గంటలకు ఈ కామెడీ నైట్స్ ప్రసారమవుతుంది.