• Home »
  • Entertainment »
  • ’కామెడీ నైట్స్ విత్ కపిల్’ ఆపేయాలని నిర్ణయం

’కామెడీ నైట్స్ విత్ కపిల్’ ఆపేయాలని నిర్ణయం

అవును. కలర్స్ చానల్ లో ప్రసారమయ్యే ’ కామెడీ నైట్స్ విత్ కపిల్ ’ త్వరలో ఆగిపోతుంది. కపిల్ శర్మ ఆరోగ్యం బాగాలేదు. ఆఖరి ఎపిసోడ్ షూటింగ్ కూడా పూర్తయింది. ఈ సంగతి కపిల్ శర్మ స్వయంగా ట్వీట్ చేశారు. బెడ్ రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు సూచించటంతో తాత్కాలికంగా విరామం ఇస్తున్నట్టు, త్వరలో మళ్ళీ వస్తానంటూ ఆ ట్వీట్ లో చెప్పారు. అయితే, ఈ విషయంలో చానల్ యాజమాన్యం మాత్రం ఎలాంటి ప్రకటనా చేయలేదు.

గతనెల లోనే ఈ కార్యక్రమం రెండేళ్ళు పూర్తి చేసుకుంది.  దీనికి అత్యంత ప్రేక్షకాదరణ రావటంతో ఈ మధ్యనే కిస్ కిస్కో ప్యార్ కరూ అనే సినిమాలోనూ అవకాశం వచ్చింది. అది సెప్టెంబర్ 25 న విడుదలవుతుందని చెబుతున్నారు. ఇది తొలి చిత్రం కావటంతో అటు సినిమా, ఇట్ ఈ షో షూటింగ్స్ మధ్య కపిల్ శర్మ చాలా బిజీగా ఉన్నారు.  వ్యాయామం చేస్తుండగా గాయపడినా షొటింగ్  బిజీలో నిర్లక్ష్యం చేయటంతో ఇప్పుడు బెడ్ రెస్ట్ అనివార్యమైందని తెలుస్తోంది.

ఫార్మాట్ విషయంలో కపిల్ శర్మ అసంతృప్తితో ఉనారంటూ కొంతకాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. నిరుడు జూన్ లోనే ఒకసారి కపిల్ శర్మ తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్టు వార్తలు వచ్చిప్పటికీ అలా జరగలేదు. కానీ ఈ ఏడాది జనవరి నుంచి వారానికి ఒకరోజు మాత్రమే ప్రసారమవుతూ వచ్చింది. సినిమాల వైపు మొగ్గు చూపటానికే తప్పుకుంటున్నారనే అభిప్రాయమూ వ్యక్తమవుతోంది. ఇంతగా ప్రజాదరణ పొందిన కార్యక్రమం స్థానంలో ప్రత్యామ్నాయంగా ఏ కార్యక్రమం ప్రసారమవుతుందో కలర్స్ చానల్ ఇంకా వెల్లడించలేదు.