• Home »
  • Advertisement Code »
  • ’ అభ్యంతరకర ప్రకటనల మీద వాట్సప్ లో ఫిర్యాదు చేయండి ’

’ అభ్యంతరకర ప్రకటనల మీద వాట్సప్ లో ఫిర్యాదు చేయండి ’

వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణలో  టెక్నాలజీని వాడుకోవటంలో భారత ప్రకటనల ప్రమాణాల మండలి ముందుంది. అందుకే వినియోగదారులు ఎప్పుడైనా తప్పుదారిపట్టించే ప్రకటనలు కనిపిస్తే వెంటనే ఆ ప్రకటనను వాట్సప్ ద్వారా +91 7710012345 నెంబర్ కు పంపాలని కోరుతోంది.  ఈ విషయాన్ని పత్రికలతోబాటు రేడియోలో కూడా ప్రచారం చేయాలని నిర్ణయించినట్టు మండలి చైర్మన్ బినయ్ రాయ్ చౌదరి చెప్పారు.

ఇటీవలి కాలంలో ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్స్ వాడుతున్నారు కాబట్టి అందరికీ అందుబాటులో ఉండేలా వాట్సప్ ద్వారా ఫిర్యాదులందుకునే విధానం ప్రవేశపెట్టామని చెప్పారు. ఎప్పుదైనా, ఎక్కడున్నా క్షణాల్లో ఫిర్యాదు చేయటానికి ఈ పద్ధతిలో వీలవుతుంది. చాలామంది ఫిర్యాదు చేయటాన్ని వాయిదా వేసే అవకాశం ఉందని, ఇలాంటి అవకాశమున్నప్పుడు అలా వాయిదావేసి మరిచిపోయే ప్రసక్తే ఉండదని ప్రకటనల ప్రమాణాలమండలి భావిస్తోంది.

అభ్యంతరకరమైన ప్రకటనల ఫొటోలు తీసిగాని , వీడియో అయితే వీడియో లేదా స్క్రీన్ షాట్ గాని పంపవచ్చు. మండలి బృందం ఈ ఫిర్యాదులను పరిశీలించి, ఆ ఫిర్యాదు అర్థవంతమనిపిస్తే ప్రకటనను నిశితంగా పరిశీలించి చర్య తీసుకుంటుంది. ఫిర్యాదుదారుడు తన నెంబర్ ఇస్తే ఆ ఫిర్యాదు మీద చర్యలు ఏ స్థాయిలో ఉన్నదో ఎస్ ఎమ్ ఎస్ కూడా అందుతుంది. ఈ మెయిల్ అడ్రెస్ ఇస్తే మెయిల్ వస్తుంది. ఇది పూర్తిగా ఉచితమని కూడా ప్రకటనల ప్రమాణాల మండలి వెల్లడించింది.