వంటల పోటీకి మొదటి బహుమతి 50 లక్షలు!

ఇప్పటివరకు వంటల కార్యక్రమాల్లో ఏ రోజుకారోజు చిన్నపాటి బహుమతులివ్వటం చూస్తూ ఉన్నాం. అయితే దీన్ని కూడా ఒక రియాల్టీ షో స్థాయికి తీసుకువచ్చి పెద్దఎత్తున పోటీ పెట్టి 50 లక్షల రూపాయల బహుమతి ఇవ్వాలనుకోవటం మాత్రం ఆశ్చర్యం కలిగించే విషయమే. అందులోనూ ఒక ప్రాంతీయ చానల్ తీసుకున్న ఈ సాహసోపేతమైన నిర్ణయం మీద టీవీ పరిశ్రమలో చర్చ సాగుతోంది.

మనోరమ గ్రూప్ కి చెందిన మలయాళీ ఎంటర్టైన్మెంట్ చానల్ మళవిల్ మనోరమ ఈ మధ్య కాలంలో సన్ గ్రూప్ వారి సూర్య టీవీని దాటిపోయి రెండో స్థానాన్ని దక్కించుకుంది. అ ఉత్సహంతో మరింత దూకుడుగా వ్యవహరిస్తోంది. అనేక భాషల్లో విడుదలైన భారీ బడ్జెట్ చిత్రం బాహుబలి ని మొదటి సారిగా బుల్లితెర మీద చూపిన ఘనతను సొంతం చేసుకుంది. ఇప్పుడు అదే క్రమంలో 50 లక్షల రూపాయల బహుమతితో వంటల పోటీ ప్రకటించింది.

ఆడవారైనా, మగవారైనా సరే వంట చేయటంలో ఆసక్తి ఉండి 18 ఏళ్లు పైబడినవారందరూ ఈ పోటీలో పాల్గొనటానికి అర్హులే. అయితే, వంటనే వృత్తిగా చేపట్టిన వాళ్లు మాత్రం అనర్హులు. కార్యక్రమం ప్రసార తేదీ ఇంకా ప్రకటించలేదు. ప్రస్తుతానికి దరఖాస్తులు మాత్ర ప్రొడ్యూసర్, కుకింగ్ రియాల్టీ షో, ఎంఎంటీవీ లిమిటెడ్, ఆరూర్ పోస్ట్, అలప్పుళ-688534 చిరునామాకు పంపాలి. లేదా chefmmtv@gmail.com కు ఈ-మెయిల్ చెయ్యవచ్చు.