• Home »
  • News »
  • జీతాల బకాయిలు చెల్లించేందుకు ఒప్పుకున్న సివిఆర్

జీతాల బకాయిలు చెల్లించేందుకు ఒప్పుకున్న సివిఆర్

నెలల తరబడి జీతాలు బకాయి పడటంతో ఉద్యోగులు సమ్మెకు దిగి ఎట్టకేలకు సివిఆర్ యాజమాన్యం బకాయిలివ్వటానికి ఒప్పుకునేట్టు చేశారు. ఉద్యోగులు ఏకమై పని స్తంభింపజేయటంతోబాటు చానల్ కార్యాలయంలోనే బస చేయటంతో ఈ సమ్మె అందరి దృష్టినీ ఆకర్షించింది. ఇమేజ్ బ్రాడ్ కాస్టింగ్ ఆధ్వర్యంలో సివిఆర్ న్యూస్, సివిఆర్ ఇంగ్లిష్, సివిఆర్ హెల్త్, సివిఆర్ ఓమ్ పేరిట నాలుగు చానల్స్ నడుసున్న సంగతి తెలిసిందే.

జీతాల బకాయిలు ఏ నెలకానెల పెరిగిపోతూ ఉన్నా, యాజమాన్యం నుంచి స్పందన కరవవటంతో ఉద్యోగులు తీవ్రమైన నిర్ణయం తీసుకోక తప్పలేదు. జర్నలిస్టు సంఘాలు కూడా మద్దతు తెలియజేసి యాజమాన్యంతో చర్చలు జరపటంతో ఒకటీ రెండు వాయిదాలు వేసినా చివరికి జీతాలు చెల్లించటానికి సంస్థ చైర్మన్ చలసాని వెంకటేశ్వరరావు ఒప్పుకోవటంతో ఉద్యోగులు సమ్మె విరమించారు.