• Home »
  • DART »
  • డిడి రేటింగ్స్ లెక్కింపు

డిడి రేటింగ్స్ లెక్కింపు

DART

శాటిలైట్ చానల్స్ వచ్చిన తరువాత వాటి ప్రేక్షకాదరణను లెక్కించటానికి ఒక ప్రత్యేక సంస్థ ఉండాలనే అభిప్రాయం వచ్చింది. ఏ సమయంలో, ఏ చానల్ లో ఏ కార్యక్రమానికి ఎక్కువ ప్రేక్షకాదరణ ఉందో ప్రత్యేకంగా లెక్కించాల్సిన అవసరం ఏర్పడటం వల్లనే టామ్ లాంటి రేటింగ్ ఏజెన్సీ భారత్ లో ప్రవేశించింది. కానీ అంతకు ముందు దూరదర్శన్ ఒక్కటే ఉన్నందువలన ఏ చానల్ ఎక్కువ మంది చూస్తున్నరనే ప్రశ్నే తలెత్తలేదు. అయినప్పటికీ ఏ కార్యక్రమానికి ఎక్కువ ప్రజాదరణ ఉందో కూడా తెలుసుకోవలసిన అవసరం డిడి తో బాటు ప్రకటనకర్తలకు ఏర్పడింది. ఆ విధంగా DART ( Doordarsahn Audience Television Rating ) ఆవిర్భవించింది. ఈ విధానంలో ఎంపిక చేసిన ప్రేక్షకులకు ఒక డైరీ అంజేస్తారు. వారం రోజులపాటు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు అందులో ఉంటాయి. డైరీ అందుకున్న ప్రేక్షకుడు వారం రోజులపాటు క్రమం తప్పకుండా జాబితాలో ఆయా కార్యక్రమాలకెదురుగా వివరాలు నింపుతాడు. అలా వారం రోజులు పూర్తికాగానే అలాంటి డైరీలన్నిటినీ తిరిగి సేకరించి సమాచారాన్ని క్రోడీకరించి, విశ్లేషించి వారానికొకసారి నివేదిక రూపొందిస్తారు. TAM (Television Audience Measurement) లెక్కింపు మొదలవటంతో ఆ సమాచారాన్ని ఉపయోగించుకునే క్రమంలో 2001 ఆగస్టు నుంచి దూరదర్శన్ DART ను నిలిపివేసింది. ప్రధాన నగరాలలో వాణిజ్యప్రకటనలను ఆకర్షించటం కోసం TAM సమాచారాన్నే వినియోగించుకుంటూ వస్తున్నది.

 

అయితే, దూరదర్శన్ ప్రజాప్రసారసంస్థ (Public Broadcasting Organisation ) గనుక ప్రజాసంక్షేమమే ధ్యేయంగా ప్రసారాలు సాగిస్తుంది.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, స్వచ్ఛందసేవా సంస్థలకు సంబంధించిన సేవా కార్యక్రమాలను ప్రసారం చేయాల్సి ఉంటుంది. పైగా TAM నివేదికలో గ్రామీణ ప్రేక్షకుల ప్రస్తావనే ఉండదు. అన్ని దూరదర్శన్ కేంద్రాలకు TAM సమాచారం అందుబాటులో కూడా లేకపోవటం వలన DART ను పునరుద్ధరించాలనే అభిప్రాయం ఏర్పడింది. TAM సర్వే లో లేని నగరాలలోను, గ్రామీణ ప్రాంతాల్లోను Doordarshan Audience Research విభాగాలతో సర్వే కొనసాగించాలని నిర్ణయించారు. ఢిల్లీ, ముంబయ్, అహ్మదాబాద్, బెంగళూర్, హైదరాబాద్, కోల్‍కతా, జలంధర్, భువనేశ్వర్, తిరువనంతపురం దూరదర్శన్ కేంద్రాల పట్టణ ప్రాంతాల ప్రేక్షకుల సమాచారం TAM అందిస్తుంది గనుక ఈ పరిధిలోని గ్రామీణప్రాంతాల్లో DART సర్వే జరుపుతుంది, అదే విధంగా నాగపూర్, లక్నో, గోరఖ్‍పూర్, రాంచి, గువాహతి, శ్రీనగర్, భోపాల్, జైపూర్, చెన్నై లలో DART సర్వే జరుపుతుంది. అయితే, చెన్నై లో మాత్రం TAM కూడా సర్వే జరిపి సమాచారం ఇస్తుంది. ఈ తొమ్మిది కేంద్రాల పరిధిలోని గ్రామీణ ప్రాంతాల్లో కూడా DART సర్వే చేస్తుంది. ఆ విధంగా 2004 మే లో DART ను పునరుద్ధరించినట్లయింది.

శాస్త్రీయపద్ధతిలో శాంపిల్ ఎంపిక జరుగుతుంది. దూరదర్శన్ కేంద్రం ఉన్న ఒక్కో పట్టణ ప్రాంతంలో 20 కాలనీలను గుర్తిస్తారు. అన్ని వర్గాల ప్రజలకు ప్రాతినిధ్యం లభించేలా ఈ కాలనీల గుర్తింపు జరుగుతుంది. ఈ కాలనీలలో పదేసి ఇళ్లను ఎంపిక చేస్తారు. ఇందులో బ్లాక్ అండ్ వైట్ టీవీలు, కలర్ టీవీలు, కేబుల్ కనెక్షన్ ఉన్నవి, లేనివి, రిమోట్ వాడే ఇళ్లు, రిమోట్ వాడని ఇళ్లు , ఆర్థిక స్థితిగతులు గమనించి అన్ని రకాలవారు తగినవిధంగా ప్రాతినిధ్యం పొందేలా ఎంచుకుంటారు. ఇదంతా శాస్త్రీయంగా జరుగుతుంది. ఆ తరువాత ఒక్కో ఇంటినుంచి ఒక్కో వ్యక్తిని ఎంచుకుంటారు. ఆ వ్యక్తి పదేళ్లు నిండిన వాడై ఉండాలి. డైరీ నింపగలిగిన వాడై ఉండాలి. నింపడానికి ఆసక్తి కనబరచాలి. ఇలా ఎంపిక జరిపేటప్పుడు మహిళలు, పురుషులు, వివిధ వయోవర్గాలు, విద్యార్హతలు, వృత్తుల వారు తగిన విధంగా సర్వే లో పాల్గొనేలా చూస్తారు. ఇక ప్రతి దూరదర్శన్ కేంద్రం పరిధిలోని గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇలాగే సర్వే జరుగుతుంది. ముందుగా వివిధ సామాజిక, ఆర్థిక వర్గాలను ప్రతిబింబించే 20 గ్రామాలను ఎంపిక చేస్తారు. ఆ తరువాత ఆ గ్రామాల్లో పదేసి ప్రాతినిధ్యపు ఇళ్లను ఎంచుకుంటారు. పట్టణప్రాంతాల్లో అనుసరించిన విధానాన్నే ఇక్కడ కూడా పాటిస్తారు. ఎంపిక చేసిన ఇళ్లలో డైరీలు నింపాల్సిన వ్యక్తులకు వారం ప్రారంభంలో డైరీలు అందజేయటానికి, తిరిగి నింపిన డైరీలను సేకరించడానికి దినసరివేతనం మీద పట్టభద్రులను నియమిస్తారు. వీరికి తగిన శిక్షణ ఇచ్చి, ఆడియన్స్ రిసెర్చ్ విభాగం ఉద్యోగుల పర్యవేక్షణలో ఉంచుతారు.    

                           నమూనా DART డైరీ

                 ( తేదీ___________ నుంచి ___________వరకు కొనసాగే వారానికి )

 

         సర్వేలో పాల్గొనే వ్యక్తి పేరు : __________________________________________

         చిరునామా : ____________________________________________________

         ————————————————————————————————-

         వయస్సు: ________________                 స్త్రీ/పురుషుడు: _________________

         నెలసరి కుటుంబ ఆదాయం : ______________________

         కుటుంబ యజమాని పేరు : _______________________

       ————————————————————————————————

కుటుంబ సభ్యుని పేరు                                     కోడ్

———————————————————————–

1

———————————————————————–

2

————————————————————————

3

————————————————————————

4

————————————————————————

5

———————————————————————–

                           చానల్స్/కార్యక్రమాల వీక్షణం

————————————————————————————————————

తేది         సమయం         కార్యక్రమం        చానల్               సభ్యుని పేరు             అభిప్రాయం

————————————————————————————————————

5.4.2009 6.00 – 6.30

               6.30 – 7.00

               7.00 – 7.30

              7.30 – 8.00

               ————–

             —————

             23.30 – 24.00

 

ఇలా సేకరించిన డేటా ను అవసరాలకు అనుగుణంగా రకరకాలుగా విశ్లేషించేందుకు పట్టికలు తయారుచేస్తారు.

 

  1. టీవీ చూసిన వారి సమాచారం

————————————————————————-

తేది                   వారం             గ్రామీణుల     పట్టణవాసుల     మొత్తం

శాతం           శాతం           శాతం

————————————————————————-

6.4.2009     సోమవారం

7.4.2009     మంగళవారం

8.4.2009     బుధవారం

9.4.2009     గురువారం

10.4.2009     శుక్రవారం

11.4.2009     శనివారం

12.4.2009     ఆదివారం

—————————————————————————-

* ఆయా ప్రాంతాల్లో ఎంపిక చేసుకున్న శాంపిల్ ఇళ్ల సంఖ్యనే ప్రాతిపదికగా తీసుకుంటాం.

 

  1. చూసిన చానల్స్ సమాచారం

——————————————————————-

చానల్ పేరు                         గ్రామీణుల     పట్టణవాసుల     మొత్తం

శాతం           శాతం           శాతం

——————————————————————

దూరదర్శన్ చానల్స్

డిడి నేషనల్

డిడి ప్రాంతీయం

డిడి న్యూస్

డిడి స్పోర్ట్స్

డిడి మెట్రో

———

———

ప్రైవేట్ శాటిలైట్ చానల్స్

స్టార్ ప్లస్

సోనీ

జీ టీవీ

—-

—-

—-

జెమిని

ఈటీవీ

—–

—–

 

* ఆయా ప్రాంతాల్లో ఎంపిక చేసుకున్న శాంపిల్ ఇళ్ల సంఖ్యనే ప్రాతిపదికగా తీసుకుంటాం.

  1. చానల్ వారీగా చూసిన కార్యక్రమాలు

దూరదర్శన్ చానల్ : _____________ తేది : _________ వారం: ________

————————————————————————–

సమయం     కార్యక్రమం         వ్యవధి         గ్రామీణుల పట్టణవాసుల   మొత్తం

శాతం       శాతం        శాతం

————————————————————————–

 

 

—————————————————————————

 

  1. 4. అన్ని చానల్స్ లో మొదటి 50 కార్యక్రమాలు
  1. డిడి చానల్స్ లో మొదటి 50 కార్యక్రమాలు
  1. స్థానిక డిడి కేంద్రంలో మొదటి 10 కార్యక్రమాలు

ఈ విధంగా రకరకాల విశ్లేషణల ద్వారా ప్రేక్షకుల నాడిని గుర్తించే ప్రయత్నం చేస్తారు. ఇతర చానల్స్ తో పోల్చిచూపడం ద్వారా ప్రకటనదారులను ఆకట్టుకునేందుకు, ప్రేక్షకాదరణను వివరించేందుకు వీలవుతుంది.

 

*****