• Home »
  • Other Channels »
  • డిడి భారతిలో అయోధ్యనుంచి శ్రీరామనవమి వేడుకల ప్రత్యక్షప్రసారం

డిడి భారతిలో అయోధ్యనుంచి శ్రీరామనవమి వేడుకల ప్రత్యక్షప్రసారం

శ్రీరామ నవమి సందర్భంగా అయోధ్యలో జరిగే వేడుకలను డిడి భారతి ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. రామ జన్మ భూమిగా ప్రసిద్ధమైన  అయోధ్య నగరంలో కనక్ సోనె కి మందిర్ గా పిలుచుకునే కనక్ భవన్ నుంచి ఈ వేడుకలను ప్రసారం చేస్తున్నట్టు ప్రసారభారతి అధికారులు వెల్లడించారు. ఆధ్యాత్మికంగాను, శిల్పకళారీతి పరంగానూ ఈ నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యం ఉంది.

ఏటా శ్రీరామనవమి సందర్భంగా దేశం నలుమూలలనుంచి  లక్షలాది మంది భక్తులు అక్కడికి చేరుకొని ప్రార్థనల్లో పాల్గొంటారు. యాత్రికులతో కిక్కిరిసి పోయే ఈ ప్రదేశం పండుగ శోభను  సంతరించుకుంటుంది. భక్తులు సరయూ నదిలో పవిత్ర స్నానాలు ఆచరించి పూజలో పాల్గొంటారు. 15 వ తేదీ ఉదయం 11.30 నుంచి గంట సేపు ప్రత్యక్షప్రసారం జరుగుతుంది.