• Home »
  • Cable/DTH/HITS »
  • డిడి ఫ్రీడిష్ లో ప్రసారాలకు 12న ఈ-వేలం

డిడి ఫ్రీడిష్ లో ప్రసారాలకు 12న ఈ-వేలం

దూరదర్శన్ వారి ఉచిత డిటిహెచ్ ప్లాట్ ఫామ్  ’ ఫ్రీడిష్ ’ ద్వారా ప్రసారాలు అందించాలనుకునే బ్రాడ్ కాస్టర్ల కోసం ఈ నెల 12 న ఈ-వేలం నిర్వహిస్తోంది. వచ్చే కొద్ది నెలల్లో తన లక్ష్యమైన 112 చానల్స్ చేరుకోవాలని ఫ్రీడిష్ భావిస్తోంది. దూరదర్శన్ రూ. 3 కోట్ల 70 లక్షలు రిజర్వ్ ధరగా నిర్ణయించినప్పటికీ, గతంలో జరిగిన వేలంలో ఈ ధర రూ. 4 కోట్ల 20 లక్షల దాకా వెళ్ళింది.

ఎన్ని చానల్స్ కోసం ఇప్పుడు వేలం వేస్తున్నదీ మాత్రం అధికారులు వెల్లడించటంలేదు. వేలంలో పాల్గొనేవారు సిండికేట్ గా తయారై తక్కువ ధరకే తీసుకుంటారనే అనుమానంతో ఈ విషయాన్ని రహస్యంగా ఉంచినట్టు తెలుస్తోంది. ప్రసారభారతి తరఫున నోయిడాకు చెందిన సి1 ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ ఈ-వేలం నిర్వహిస్తుంది.

ప్రస్తుతం ఫ్రీడిష్ ద్వారా 64 చానల్స్ ప్రసారమవుతున్నాయి. అందులో లోక్ సభ, రాజ్యసభ చానల్స్ తో బాటి డిడి చానల్స్ అన్నీ ఉన్నాయి. వేలంలో పాల్గొనే వారు కోటీ యాభై లక్ష్జలు ఇఎండి కట్టాల్సి ఉంటుంది. ప్రతి 15 నిమిషాలకు ఒకసారి ఒక రౌండ్ చొప్పున ఉంటుంది. పది లక్షలకు తక్కువ కాకుండా వేలం పాడాలి. దరఖాస్తుదారుడు తన అప్ లింక్, డౌన్ లింక్ లైసెన్సులను వేలం సమయంలో చూపించాల్సి ఉంటుంది.