• Home »
  • BARC »
  • ఇండియా-సౌతాఫ్రికా సిరీస్ కి బ్రేక్ : డిడి రేటింగ్స్ భారీ పతనం

ఇండియా-సౌతాఫ్రికా సిరీస్ కి బ్రేక్ : డిడి రేటింగ్స్ భారీ పతనం

హిందీ జనరల్ ఎంటర్టైన్మెంట్ చానల్స్ లో స్టార్ ప్లస్ తన నెంబర్ వన్ స్థానాన్ని కొనసాగిస్తుండగా డిడి నేషనల్ మాత్రం భారీ పతనాన్ని చవిచూసింది. ఇండియా-సౌతాఫ్రికా టెస్ట్ సిరీస్ లో విరామమే దీనికి కారణమని బార్క్ రేటింగ్స్ విశ్లేషణను బట్టి అర్థమవుతోంది.

అదే సమయంలో జీ అన్మోల్ అప్రతిహతంగా తన జైత్ర యాత్ర కొనసాగిస్తూ ఉంది. 43 వారంలో గరిష్ఠంగా లబ్ధిపొందిన చానల్ గా నమోదైంది. కలర్స్ చానల్ కొద్దిపాటి రేటింగ్స్ పెంచుకోగలిగి నప్పటికీ మూడో స్థానానికి పడిపోగా జీ టీవీ భారీగా పెరిగి నాలుగో స్థానం దగ్గర ఉంది.

లైఫ్ ఓకే కి ఐదో స్థానం, స్టార్ ఉత్సవ్ కి ఆరో స్థానం, సబ్ టీవీకి ఏడో స్థానం దక్కాయి. సబ్ టీవీ తొమ్మిదో రాంక్ నుంచి ఏడో రాంక్ కు ఎదగటం విశేషం. డిడి నేషనల్ ఐదో స్థానం నుంచి ఎనిమిదో స్థానానికి పడిపోయింది. సోనీ 8వ స్థానం నుంచి 9 వ స్థానానికి పడిపోయింది.