• Home »
  • BARC »
  • డిడి నేషనల్ ని ఆదుకోలేకపోయిన ఏషియాకప్ రేటింగ్స్

డిడి నేషనల్ ని ఆదుకోలేకపోయిన ఏషియాకప్ రేటింగ్స్

మార్చి 5-11 మధ్య సాగిన 10 వ వారంలో  అత్యధిక ప్రేక్షకాదరణ పొందిన కార్యక్రమాల జాబితాలో దూరదర్శన్ నేషనల్ ముందుంది. అందులో ప్రసారమైన మైక్రోమాక్స్ ఏషియా కప్ టి20 చూసినవాళ్ళే అత్యధికమని బార్క్ అందించిన తాజా సమాచారం వెల్లడించింది. కలర్స్ లో ప్రసారమైన నాగిన్ కి రెండో స్థానం, స్టార్ ప్లస్ లో ప్రసారమైన సాథ్ నిభనా సాథియా, యే హై మొహబ్బతే మూడు, నాలుగు స్థానాల్లో ఉండగా జీటీవీ వారి కుంకుమ్ భాగ్య ఐదో స్థానంలో ఉంది.

అయితే, టాప్ టెన్ హిందీ చానల్స్ లో మాత్రం డిడి నేషనల్ కు స్థానం దక్కలేదు. నెంబర్ వన్ కార్యక్రమాన్ని సొంతం చేసుకున్నప్పటికీ కనీసం పదో రాంకులో కూడా డిడి నేషనల్ లేదు.  స్టార్ ప్లస్ మొదటి స్థానంలో, కలర్స్ రెండో స్థానంలో, జీ టీవీ మూడో స్థానంలో, జీ అన్మోల్ నాలుగో స్థానంలో, సోనీ పాల్ ఐదో స్థానంలో ఉన్నాయి.   స్టార్ ఉత్సవ్,  లైఫ్ ఓకే 6,7 స్థానాల్లో ఉండగా ఆ తరువాత రాంకుల్లో రిష్టే, సబ్ టీవీ, సోనీ ఉన్నాయి.