• Home »
  • Entertainment »
  • దూరదర్శన్ నేషనల్ లో స్లాట్స్ వేలం : ఆదాయం పెంచుకునే ప్రయత్నం

దూరదర్శన్ నేషనల్ లో స్లాట్స్ వేలం : ఆదాయం పెంచుకునే ప్రయత్నం

దూరదర్శన్ ఆదాయం పెంచుకునే మార్గాల మీద దృష్టి సారించింది. ముందుగా స్లాట్స్ అమ్మకమే మేలన్న అభిప్రాయానికొచ్చింది. వేలం ద్వారా స్లాట్స్ అమ్మితే ఎక్కువ ఆదాయం లభించవచ్చునని, పారదర్శకంగా కూడా ఉంటుందని భావిస్తోంది. ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కార్యక్రమాలలో మార్పులు చేయటం మీద దృష్టిపెట్టినప్పటికీ ఆదాయం పరంగా ఆశించినంత ఫలితం కనబడటం లేదని భావించిన అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

.2013-14 లో వాణిజ్యప్రకటనల ద్వారా రూ. 1140.5 కోట్లు లభించగా 2014-15 లో వచ్చిన ప్రకటనల ఆదాయం రూ. 995.6 కోట్లకు తగ్గిపోయింది. ఈ ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ వరకు వచ్చిన ఆదాయం కేవలం రూ. 493.29 కోట్లుండటంతో ప్రకటనల ఆదాయం గణనీయంగా పడిపోతున్నట్టు గుర్తించిన దూరదర్శన్ ప్రత్యామ్నాయ మార్గాలమీద దృష్టి పెట్టింది. అందులో భాగంగానే ఇప్పుడు స్లాట్స్ అమ్మకాల ఆలోచనలో ఉంది.