100 దేశాలకు దూరదర్శన్ న్యూస్

దూరదర్శన్ 24 గంటల వార్తల ప్రసారాలు సుమారు 100 దేశాలకు అందేలా చర్యలు తీసుకుంటున్నట్టు సమాచార ప్రసార మంత్రిత్వశాఖ వెల్లడించింది.భారతదేశ వ్యవహారాలతోబాటు విదేశీ వ్యవహారాల పట్ల భారత వైఖరి కూడా ఎక్కువ దేశాలకు చాటిచెప్పటానికి వీలుగా ఈ వేదికను మరింత మెరుగుపరచాలని భావిస్తున్నట్టు అధికారులు పేర్కొన్నారు. ఇతర దేసాల ప్రసారాలలో ప్రధానంగా సాంస్కృతిక, వినోద కార్యక్రమాలకే ప్రాధాన్యం ఇస్తుందగా ఇకమీదట వార్తలకూ పెద్దపీట వేయాలని నిర్ణయించుకోవటమే అందుకు కారణం.

ప్రస్తుతం దూరదర్శన్ న్యూస్ చానల్ ప్రసారం చేసే కరెంట్ ఎఫైర్స్ కార్యక్రమాలు నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, చైనా దేశాలకు మాత్రమే పరిమితమయ్యాయి. అయితే, ఆయా దేశాలలో పంపిణీకి అనుసరించాల్సిన నియమనిబంధనలు, పంపిణీ ఖర్చులు కూడా దృష్టిలో ఉంచుకోవటం వల్లనే ఇప్పటివరకూ ప్రసారాలను పరిమితం చేసినట్టు తెలుస్తోంది. అదే సమయంలో ఒక దేశంలో భారత వార్తాప్రసారాలు అందించాలంటే అక్కడ ఎంతమంది భారతీయులు నివసిస్తున్నారనే విషయం, అక్కడినుంచి భారత్ లోకి వస్తున్న పెట్టుబడులు లాంటి అంశాలను కూడా లెక్కలోకి తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్నారు.

 

.