• Home »
  • Cable »
  • భారతీయ కాస్ ఆలస్యమైతే స్వదేశీ సెట్ టాప్ బాక్సులమీద ప్రభావం

భారతీయ కాస్ ఆలస్యమైతే స్వదేశీ సెట్ టాప్ బాక్సులమీద ప్రభావం

స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన కండిషనల్ యాక్సెస్ సిస్టమ్ ( కాస్ ) ఆలస్యమయ్యే పక్షంలో స్వదేశీ సెట్ టాప్ బాక్సుల అందుబాటులోనూ జాప్యం తప్పదని ఐటి మీద స్థాయీ సంఘం హెచ్చరించింది. ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖను హెచ్చరిస్తూ నివేదిక అందించింది. బెంగళూరుకు చెందిన బైడిజైన్ అనే సంస్థ సి-డాక్ తో కలసి స్వదేశీ కాస్ ను తీర్చిదిద్దుతున్న సంగతి తెలిసిందే.

ఇప్పటివరకు జరిపిన సమీక్షా సమావేశాల్లో కాస్ సకాలంలో పొర్తవుతుందని చెబుతూ వచ్చారు. అయితే గడువు తేదీ అయిన నవంబర్ నెల ముగిసి మూడు నెలలు దాటినప్పటికీ ఇంకా స్వదేశీ కాస్ అందుబాటులోకి రాకపోవటం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రభుత్వం దీని ఆవిష్కారాన్ని వాయిదా వేస్తూ వస్తోంది. ఇలా ఆలస్యం కావటం వలన స్వదేశీ సెట్ టాప్ బాక్సులు తయారు చేసి కూడా ప్రయోజనం ఉండదని కమిటీ తన నివేదికలో హెచ్చరించింది.