• Home »
  • Cable »
  • మూడోదశ డిజిటైజేషన్: మరో ఐదు స్టే పిటిషన్ల మీద కేంద్రానికి నోటీసులు

మూడోదశ డిజిటైజేషన్: మరో ఐదు స్టే పిటిషన్ల మీద కేంద్రానికి నోటీసులు

మూడో దశ గడువు పొడిగించాలంటూ వివిధ హైకోర్టులలో పిటిషన్లు దాఖలు చేసిన ఐదుగిరి స్టే ఉత్తర్వులమీద ఢిల్లీ హైకోర్టు ఈ రోజు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. చీఫ్ జస్టిస్ జి. రోహిణి, జస్టిస్ సంగీతా ధింగ్రా సెహగల్ ఈ రోజు పిటిషనర్ల వాదనను కొద్ది సేపు విన్న తరువాత ఈ నెల 26 కు వాయిదా వెస్తూ సమాచార, ప్రసార మంత్రిత్వశాఖకు నోటీసులు జారీచేశారు.

ఈ రోజు విచారణకు వచ్చిన కేసులలో రేడియెంట్ డిజిటెక్ నెట్ వర్క్స్ , రాజస్థాన్ కేబుల్ ఆపరేటర్స్ ఫౌండేషన్, నాసిక్ జిల్లా కేబుల్ ఆపరేటర్స్ అసోసియేషన్, ఇండస్ ఇండ్ మీడియా కమ్యూనికేషన్స్ లిమిటెడ్, భీమా రిద్ధి డిజిటల్ సర్వీస్ ఉన్నాయి.మొదటి రెండు పిటిషన్లు భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాఖలైనవి కాగా మిగిలిన మూడు పిటిషన్లు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని సవాలు చేశాయి.

నిన్న బుధవారం విచారణకు వచ్చిన పిటిషన్లను అక్టోబర్ 5 కు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. వాటిని విచారించిన జస్టిస్ సంజీవ్ సచ్ దేవ ఈ నెల 13న మరో మూడు కేసుల విచారణ చేపట్టాల్సి ఉంది. ఆలస్యంగా బదలీ అయి వచ్చిన కేసులు కావటంతో వాటిని విడిగా విచారణకు తీసుకోవాల్సి వచ్చింది. ఈ కేసులో ఇంప్లీడ్ కావటానికి బ్రాడ్ కాస్టర్ల తరఫున ఇండియన్ బ్రాడ్ కాస్టింగ్ ఫౌండేషన్ (ఐబిఎఫ్) దాఖలు చేసుకున్న పిటిషన్ కూడా విచారణకు రాలేదు. ఇది కూడా సెప్టెంబర్ 13 న వివారణకు వచ్చే అవకాశముంది.