• Home »
  • Cable »
  • హిట్స్, ఎమ్మెస్వో సమానమేనా? : టిడిశాట్ పరిధిని పరిశీలిస్తున్న ఢిల్లీ హైకోర్టు

హిట్స్, ఎమ్మెస్వో సమానమేనా? : టిడిశాట్ పరిధిని పరిశీలిస్తున్న ఢిల్లీ హైకోర్టు

హెడ్ ఎండ్ ఇన్ ద స్కై (హిట్స్)  ఆపరేటర్ ను ఎమ్మెస్వోలతో సమానంగా చూడాలన్న టెలికామ్ డిస్ప్యూట్స్ సెటిల్మెంట్ అండ్ అప్పిల్లేట్ ట్రైబ్యునల్ ( టిడిశాట్ ) కు ఆ అధికారం ఉన్నదా అనే అంశం మీద ఢిల్లీ హైకోర్టు తన తీర్పును రిజర్వ్ చేసింది. నిబంధనలను తిరగరాస్తూ, టిడిశాట్ బ్రాడ్ కాస్టర్లకు చేసిన ఈ సూచన చెల్లుబాటవుతుందా అనే విషయం మీద ఢిల్లీ హైకోర్టు విచారణ జరిపింది. హిట్స్ ని దేశవ్యాప్త ఎమ్మెస్వోగా పరిగణించాలని  టిడిశాట్ సూచించటం తెలిసిందే.

2015 డిసెంబర్ 7న ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పు మీద స్టార్ ఇండియా దాఖలు చేసిన పిటిషన్ మీద జస్టిస్ రాజివ్ సహాయ్ విచారణ జరిపారు.  ఈ తీర్పు వెలువడేవరకు స్టార్ ఇండియా సంస్థ హాత్ వే, డెన్, సిటికేబుల్ తో కుదుర్చుకున్న ఒప్పందాలను ఇవ్వాలన్న డిసెంబర్ 18 నాటి టిడిశాట్ ఆదేశాలు కూడా సస్పెండయినట్టు పరిగణించాలని కూడా ఢిల్లీ హైకోర్టు చెప్పింది. ఈ వ్యవహారాన్ని జనవరి 12 కు వాయిదా వేసింది.