• Home »
  • Cable »
  • స్టార్ ఇండియాకు 50% వాటా అమ్మేసిన డెన్

స్టార్ ఇండియాకు 50% వాటా అమ్మేసిన డెన్

డెన్ నెట్ వర్క్స్ తన ఉమ్మడి వ్యాపార భాగస్వామి అయిన స్టార్ ఇండియాకు తన 50% వాటాను అమ్మటానికి నిర్ణయించుకుంది. నిజానికి 2008 లో స్టార్ ఇండియా, డెన్ నెట్ వర్క్స్ కలిసి సమాన భాగస్తులుగా ఉమ్మడి వ్యాపార ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఆ తరువాత 2011 లో ఈ ఒప్పందపు గడువు పొడిగించుకున్నాయి .  అయితే, ఇప్పుడు తనవాటాను స్టార్ ఇండియాకు అమ్మాలని డెన్ నెట్ వర్క్స్ నిర్ణయించుకుంది.

ఈ మేరకు స్టాక్ ఎక్స్ఛేంజ్ కి కూడా తెలియజేసింది. ఈ ఒప్పందం విలువ రూ. 40  కోట్ల 35 లక్షలని తెలుస్తోంది.  ఈ వార్త పొక్కిన వెంటనే బొంబాయ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ లో  డెన్ వాటా ధర దాదాపు 15% పెరుగుదల నమోదు చేసుకుంది. రూ. 10 ముఖ విలువ ఉన్న డెన్ వాటా ధర రూ. 82.90 నుంచి రూ. 99.20 కి పెరిగింది.