• Home »
  • Top Stories »
  • డిజిటల్ ఎమ్మెస్వోలకు ప్రస్తుతానికి తాత్కాలిక లైసెన్సులు

డిజిటల్ ఎమ్మెస్వోలకు ప్రస్తుతానికి తాత్కాలిక లైసెన్సులు

Cables డిజిటైజేషన్ లో భాగంగా ఎమ్మెస్వోలు ప్రత్యేకంగా డిజిటల్ ఎమ్మెస్వో లైసెన్సులు తీసుకోవాల్సి ఉండగా ప్రస్తుతానికి తాత్కాలిక  లైసెన్సులతో సరిపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. పెండింగ్ దరఖాస్తులు చాలా ఉండగా హోంశాఖ నుంచి క్లియరెన్సులు  ఆలస్యం అవుతుండటంతో గడువులోగా డిజితైజేషన్ పూర్తి కాకపోవచ్చునన్న అనుమానాలు మొదలయ్యాయి. దీంతో  ప్రస్తుతానికి తాత్కాలిక లైసెన్సులు మంజూరు చేయాలని నిర్ణయించినట్టు సమాచార, ప్రసారాల మంత్రిత్వశాఖ వెల్లడించింది.

నిజానికి మొదటి దశ సమయంలోనూ తాత్కాలిక లైసెన్సులు ఇవ్వగా ఆ తరువాత హోంశాఖ కొమ్తమంది ఎమ్మెస్వోలకు  సెక్యూరిటీ క్లియరెమ్స్ ఇవ్వలేదు. దాంతో ఆ తాత్కాలిక లైసెన్సులు రద్దు చేస్తున్నట్టు సమాచార, ప్రసారాల మంత్రిత్వశాఖ  ప్రకటించింది. ఆ తరువాత అలాంటి ఎమ్మెస్వోలు కోర్టుకు వెళ్ళి అనుమతి కొనసాగుతున్నారు. అలాంటి ఇబ్బంది రాకూడదనే  ఉద్దేశంతో ఒకేసారి శాశ్వత లైసెన్సులు ఇవ్వాలని మంత్రిత్వశాఖ నిర్ణయించిది.

CABDIG

కానీ సమగ్రమైన విచారణ జరిపి సెక్యూరిటీ క్లియరెన్స్ ఇవ్వతానికి హోం శాఖకు తగినంత సమయం లేకపోవటంతో బాగా జాప్యం జరుగుతోంది. దాదాపు 200 శాటిలైట్ చానల్ దరఖాస్తులు, 680 ఎమ్మెస్వో లైసెన్స్ దరఖాస్తులు పెండింగ్ లో ఉండటంతో ఇప్పట్లో అందరికీ శాశ్వత లైసెన్సులు ఇవ్వటం అసాధ్యమని మంత్రిత్వశాఖకు అర్థమైంది. అందుకే తాత్కాలిక ప్రాతిపదికన లైసెన్సులు తీసుకొని పనులు మొదలుపెట్టుకోవచ్చునని సూచించింది.

అయితే, ఇలా తాత్కాలైక లైసెన్సులు తీసుకోవటానికి ఒప్పుకునే ఎమ్మెస్వోలు ఒక డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. సెక్యూరిటీ క్లియరెన్స్ రాకపోవటం లాంటి కారణాలవల్ల లైసెన్స్ నిరాకరించే పక్షంలో ఈ తాత్కాలిక లైసెన్స్ చెల్లుబాటు కాదన్న విషయాన్ని ఒప్పుకుంటూ ఆ డిక్లరేషన్ మీద సంతకం చేసి ఇవ్వాలి. గతంలో ఎమ్మెస్వో లైసెన్సులు రద్దయినవాళ్ళు కోర్టుకెళ్ళటాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ డిక్లరేషన్ తీసుకుంటోంది. అందువల్ల దరఖాస్తు చేసుకున్న డిజిటల్ ఎమ్మెస్వోలందరికీ నెలలోపే ఈ తాత్కాలిక లైసెన్సులు మంజూరయ్యే అవకాశాలున్నాయి.

Find Attachment for Provisional Registration to MSOs