• Home »
  • International Channels »
  • భారత్ లో డిస్కవరీకి 20 ఏళ్లు : 3 రోజుల స్పెషల్ సిరీన్ ప్రసారం

భారత్ లో డిస్కవరీకి 20 ఏళ్లు : 3 రోజుల స్పెషల్ సిరీన్ ప్రసారం

ఈ నెల 15న  స్వాతంత్ర్య దినోత్సవం నాటికి భారతదేశంలో డిస్కవరీ చానల్ ప్రవేశించి 20 ఏళ్లు పూర్తవుతుంది. ఈ సందర్భంగా మూడు భాగాలతో కూడిన ఒక సిరీస్ ప్రసారం చేయాలని నిర్ణయించింది.  చరిత్రలో అత్యంత కీలకమైన వీడియోల సాయంతో భారత స్వాతంత్ర్యోద్యమ చరిత్రకు దృశ్యరూపమివ్వటానికి రంగం సిద్ధం చేసింది. ఈ నెల 14 నుంచి 16 వరకు సాయంత్రం 8 గంటలకు “ ఇండియా ఎమర్జస్ : ఎ విజువల్ హిస్టరీ “  పేరుతో ఇది ప్రసారమవుతుంది.
భారత దేశంలో బ్రిటిష్ పాలననాటి పరిస్థితులతో మొదలై స్వాతంత్ర్యం కోసం జరిగిన పోరాట ఘట్టాలను వర్ణిస్తూ సాగుతుంది. స్వాతంత్ర్యం వచ్చాక జరిగిన 1948, 1965, 1971 యుద్ధాలను, ఇందిరాగాంధీ హయాంలో ఎమర్జెన్సీ విధింపు, ఆపరేషన్ బ్లూ స్టార్ లాంటి ఘట్టాలనూ ఈ సిరీస్ లో అందిస్తున్నారు. అర్థరాత్రి స్వతంత్రంతోబాటే దేశవిభజన మిగిల్చిన విధ్వంసాన్ని కూడా కళ్ళకు కట్టినట్టు చూపుతుందని అనేక సవాళ్ళ తరువాత బలమైన భారత్ ఆవిష్కరించటం చూపుతుందని డిస్కవరీ నెట్ వర్క్స్ దక్షిణాసియా జనరల్ మేనేజర్ రాహుల్ వెల్లడించారు.