• Home »
  • Entertainment »
  • డిస్కవరీ కిడ్స్ లో కొత్త సిరీస్ ’ ఇన్ సెక్టిబుల్స్’

డిస్కవరీ కిడ్స్ లో కొత్త సిరీస్ ’ ఇన్ సెక్టిబుల్స్’

పిల్లలను ఒక సరికొత్త ప్రపంచంలోకి తీసుకువెళ్ళే సిరీస్ ప్రసారానికి డిస్కవరీ కిడ్స్ శ్రీకారం చుట్టింది. బుల్లి ప్రపంచంలో పెద్ద సాహసాలు చూపించే ఈ కార్యక్రమం ప్రతిరోజూ సాయంత్రం 3 గంటలకు ప్రసారమవుతుంది. ఇందులో జాక్ తన తాత ఇంట్లో గడిపే రోజులు, అక్కడ తాత కనిపెట్టే ఆసక్తికరమైన వస్తువులు ఎలాంటి అనూహ్యమైన మలుపులు తీసుకుంటాయి అనేది కథాంశం. ఈ కథలో  ష్రింకినేటర్ తో అనుభవాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి.

తాత కనిపెట్టే వాటిలో జరిగే పొరపాట్ల వలన జాక్ ఎదుర్కునే ఇబ్బందులు కూడా సరదాగా ఉంటాయి. అందులో ముఖ్యమైనది అడిల్లా. బొద్దింకలను, చీమల సేనను, ఆకలిగొన్న సాలీడుని బెదిరించటం, ప్రపంచాన్ని కాపాడే బాధ్యతను భుజాలకెత్తుకొని దోమను నాశనం చేసే పనికి పూనుకోవటం ఆసక్తి కలిగిస్తాయి. ఈ క్రమంలో జాక్ పథకాలకు అడిల్లా ఎలా ఇబ్బందులు కలిగిస్తుందో చూపిస్తారు. ఇంతకీ అడిల్లా దాడి చేసేలోగా  జాక్, అతడి తాత మళ్ళీ  తమ తమ సైజుకు తిరిగి వస్తారా అన్నది ప్రశ్న.