• Home »
  • International Channels »
  • అంతరిక్షశాస్త్రం మీద డిస్కవరీ సైన్స్ లో నవంబర్ నెలంతా ప్రత్యేక కార్యక్రమాలు

అంతరిక్షశాస్త్రం మీద డిస్కవరీ సైన్స్ లో నవంబర్ నెలంతా ప్రత్యేక కార్యక్రమాలు

అంతుచిక్కని అంతరిక్ష రహస్యాలను ఛేదించటానికి ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిశోధనలన్నిటినీ పరిచయం చేస్తూ, ఇప్పటిదాకా సాధించిన పురోగతిని, ముందు ముందు జరగాల్సిన పరిశోధనలను వివరించే ప్రత్యేక కార్యక్రమాల పరంపర డిస్కవరీ సైన్స్ లో ప్రసారం కాబోతోంది. నవంబర్ 2 నుంచి ప్రతి రోజూ రాత్రి 9 గంటలకుఈ కార్యక్రమం ప్రసారమవుతుంది. నవంబర్ ను అంతరిక్షమాసంగా పాటిస్తున్నట్టు డిస్కవరీ ప్రకటించుకుంది.

అంతరిక్ష అద్భుతాలను ఆవిష్కరిస్తూ, అనేక మిస్టరీలను ఛేదిస్తూ సాగిన శాస్త్ర పరిశోధనలను వివరిస్తూ ఈ కార్యక్రమాలు రూపొందించారు. భూమికి 17 వేల మైళ్ళ దూరంలో ఉండి భూమిని గమనిస్తూ ఛాయాచిత్రాలు తీసే ఉపగ్రహాలగురించి ఇందులో చూస్తాం. వేలాది సంవత్సరాలకింద భూగర్భంలో, జలగర్భంలో కలసిపోయిన ప్రాచీన నగరాల ఆనవాళ్ళు వెలికి తీయటం మొదలుకొని ఉపగ్రహాల సాయంతో చేసిన అనేక పరిశొధనలను మన కళ్ళముందుంచుతుంది.