• Home »
  • International Channels »
  • గంగా నది పుట్టుక మీద 15న డిస్కవరీలో ప్రత్యేక కార్యక్రమం

గంగా నది పుట్టుక మీద 15న డిస్కవరీలో ప్రత్యేక కార్యక్రమం

గంగానది పుట్టుక మొదలు అది ప్రవాహంగా మారేదాకా అధ్యాత్మిక, సాంస్కృతిక, భౌగోళిక కోణాలను స్పృశిస్తూ డిస్కవరీ చానల్ గంట నిడివిగల ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించింది. ఈ నెల 15 న ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది. అద్భుతమైన దృశ్యాలకు తగినట్టు బిగువు సడలని వ్యాఖ్యానంతో హిందువుల పవిత్ర నదిని, దాని ఉపనదులను , వాటి వెనుక దాగిన కథను, పర్యావరణాన్ని వివరించేందుకు డిస్కవరీ చేసిన ప్రయత్నం సఫలమైందని డిస్కవరీ ప్రతినిధులు చెబుతున్నారు.

శివలింగ, భగీరథ మంచు శిఖరాలనుంచి పుట్టుకతో గంగానది మీద ప్రత్యేక కార్యక్రమం మొదలవుతుంది. భారతదేశంలోని నాలుగు అత్యంత ప్రధానమైన క్షేత్రాల్లో ఒకటైన భద్రీనాథ్ మొదలుకొని రామ్ గంగా వరకు సాగే యాత్రతోబాటు ప్రపంచ యోగా కేంద్రంగా భాసిల్లే హృషీకేష్ లో జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ దగ్గర అది భారీ స్థాయిలో పర్యావరణ పర్యాటకానికి దోహద పడుతున్న తీరును ఈ కార్యక్రమంలో చిత్రీకరించారు.  ఆ తరువాత చివరిగా హరిద్వార్ లో సందర్శకుల హారతులందుకునేదాకా  గంగానది ఒడ్డున నివసించే ప్రజల అనుభూతులను గుదిగుచ్చి మరీ ఈ కార్యక్రమాన్ని తీర్చిదిద్దారు.