• Home »
  • DTH »
  • డిష్ టీవీ డిటిహెచ్ లైసెన్స్ పొడిగింపుకు సిద్ధం: షరతులతో లేఖ రాసిన ప్రభుత్వం

డిష్ టీవీ డిటిహెచ్ లైసెన్స్ పొడిగింపుకు సిద్ధం: షరతులతో లేఖ రాసిన ప్రభుత్వం

జీ గ్ర్రూపుకు చెందిన డిటిహెచ్ ఆపరేటర్ డిష్ టీవీకి తాత్కాలికంగా లైసెన్స్ పొడిగించేందుకు ప్రభుత్వం సూత్రప్రాయంగా ఒప్పుకుంది. ఈ మేరకు సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ ఒక లేఖ రాసినట్టు డిష్ టీవీ వర్గాలు వెల్లడించాయి. తాజాగా 40 కోట్ల రూపాయల బ్యాంక్ గ్యారెంటీ సమర్పించాలని, ప్రభుత్వం తీసుకోబోయే విధానపరమైన నిర్ణయాలకు కట్టుబడి ఉంటాననే హామీ ఇవ్వాలని ఆ లేఖలో కోరింది.

డిటిహెచ్ ఆపరేటర్లకు పదేళ్ళ పాటు అమలులో ఉండేలా గతంలో ప్రభుత్వం ఇచ్చిన లైసెన్స్ గడువు పూర్తికావటంతో గత<లో ప్రభుత్వం డిష్ టీవీకి  ఏడాదిపాటి లైసెన్స్ పొడిగించింది. ఈ లోపు  లైసెన్సింగ్ విధి విధానాలు రూప్దించాల్సిందిగా ప్రభుత్వం ట్రాయ్ ని కోరింది. ట్రాయ్ సిఫార్సులమీద ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అందుకే ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయాలకు కట్టుబడి ఉండేలా డిష్ టీవీని హామీ పత్రం కోరింది.

భారతదేశపు తొలి  డిటిహెచ్ ఆపరేటర్ డిష్ టీవీ కాగా, ఆ తరువాత టాటా స్కై వచ్చింది. ఇప్పుడు టాటా స్కై కూడా తన పదేళ్ళ లైసెన్స్ కాలం పూర్తి కావస్తుండటంతో ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూస్తోంది. చందాదారుల సంఖ్యా పరంగా చూస్తే డిష్ టీవీ కి అందరికంటే ఎక్కువగా కోటీ 40 లక్షలమంది ఉన్నారు.