• Home »
  • Cable/DTH/HITS »
  • మళ్ళీ పట్టాలెక్కిన డిష్ – వీడియోకాన్ విలీన ఒప్పందం

మళ్ళీ పట్టాలెక్కిన డిష్ – వీడియోకాన్ విలీన ఒప్పందం

తాత్కాలికంగా ఎదురైన సమస్య నుంచి వీడియోకాన్ బైటపడటంతో డిష్ టీవీతో విలీనమయ్యే విషయం మళ్ళీ గాడిలోపడింది.  వీడియోకాన్ కు సంబంధించిన ఒక దివాలా పిటిషన్ ఇబ్బందికరంగా మారటంతో విలీనంలో జాప్యం కావటం అనివార్యమని భావించారు. అయితే, అది సద్దు మణగటంతో మళ్ళీ వ్యవహారాలు వేగం పుంజుకున్నాయి. డిష్ టీవీ ఈ మేరకు బొంబాయి స్టాక్ ఎక్స్ ఛేంజ్  కి లేఖ రాస్తూ తదుపరి చర్యలు వేగవంతం చేయాలని కోరింది.

ఈ విలీనానికి సంబంధించిన పత్రాలన్నీ రెండు సంస్థలూ రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ కి. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖకూ ఫిబ్రవరి ఆఖరు లోగా పంపాల్సి ఉంది. అలా దాఖలు చేసిన తేదీనే విలీనపు తేదీగా ఖరారు చేస్తారు. నిజానికి డిసెంబర్ 27 న దాఖలు చేస్తారని భావించినప్పటికీ వీడియోకాన్ ప్రమోటర్లకు సంబంధించిన ఒక దివాలా పిటిషన్ రావటంతో ఈ విలీనానికీ, ఆ పిటిషన్ కూ సంబంధం ఉందేమో విశ్లేషించి సలహా ఇవ్వాల్సిందిగా కంపెనీలు రెండూ తమ న్యాయసలహాదారులను కోరటం, వాళ్ళనుంచి సానుకూల సంకేతాలు రావటంతో విలీనానికి సిద్ధమవటం ఇప్పుడు తాజాప్రకటనకు కారణమని భావిస్తున్నారు.

విలీనం తరువాత ఉమ్మడి సంస్థ డిష్ టీవీ వీడియోకాన్ లో 2 కోట్ల 90 లక్షల చందాదారుల కనెక్షన్లుంటాయి. దీంతో తిరుగులేని నెంబర్ వన్ స్థానాన్ని ఈ ఉమ్మడి సంస్థ కైవసం చేసుకుంటుంది. నిజానికి గత ఆరునెలల కనెక్టివిటీని గమనిస్తే డిష్ టీవీకి టాటా స్కై అతి చేరువగా వచ్చినట్టు అర్థమవుతుంది. అయితే ఈ విలీనం వలన మళ్ళీ డిష్ టీవీ వీడియో కాన్ స్పష్టమైనాఅధిక్యంతో ముందుంటాయి.

 

 

.