• Home »
  • Cable/DTH/HITS »
  • గ్రాంట్ హిట్స్ రాకతో డిటిహెచ్ కి చెక్: నల్గొండ జిల్లా ఎమ్మెస్వోల ఆశాభావం

గ్రాంట్ హిట్స్ రాకతో డిటిహెచ్ కి చెక్: నల్గొండ జిల్లా ఎమ్మెస్వోల ఆశాభావం

హైదరాబాద్ కి దగ్గరగా ఉండటం వలన ఇప్పటిదాకా  కార్పొరేట్ ఎమ్మెస్వోల మీద ఆధారపడుతూ వచ్చిన  నల్గొండ జిల్లా ఎమ్మెస్వోలు ఇప్పుడు గ్రాంట్ హిట్స్ అందుబాటులోకి రావటంతో ఇక కష్టాలు తొలగిపోయినట్టేనని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఫైబర్ మీద దూరప్రాంతాల ఎమ్మెస్వోలు కూడా ఫీడ్ తీసుకుంటూ ఉండగా తరచూ ఫైబర్ తెగిపోవటమో, కత్తిరింపులకు గురవటమో జరుగుతూ ప్రేక్షకులు ఇబ్బందులు ఎదుర్కుంటూ వచ్చారు. స్థానిక ఎమ్మెస్వోలు తమ  ప్రమేయం లేకుండానే విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చేది. పైగా, విసిగిపోయిన ప్రేక్షకులు కేబుల్ నుంచి డిటిహెచ్ కి మారిన సందర్భాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి.

అయితే, ఇప్పుడఠిందుజా గ్రూపు వారి గ్రాంట్ హిట్స్ వలన ఇలా సుదూర ప్రాంతానికి ఫైబర్ వేయాల్సిన అవసరం లేకుండా చిన్న ఎమ్మెస్వోలు ఎక్కడికక్కడే గ్రాంట్ హిట్స్ వారి కంట్రోల్ రూమ్ సొల్యూషన్ ని ఏర్పాటుచేసుకోవటం ద్వారా నాణ్యమైన సేవలందించవచ్చునని తెలుసుకున్నారు. ఎక్కడ్ఫో హైదరాబాద్ లో ఉన్న ఎమ్మెస్వో మీద ఆధారపడటం కంటే తమ దగ్గరే హిట్స్ సొల్యూషన్ ఉండటం వలన మెరుగైన సేవలందించటంతోబాటు అస్తిత్వం కోల్పోకుండా,  లాభాలు కోల్పోకుండా వ్యాపారం కొనసాగించవచ్చుననే అభిప్రాయానికొచ్చారు.

నల్గొండలో జరిగిన గ్రాంట్  హిట్స్ అవగాహన సదస్సు సందర్భంగా ఈ టెక్నాలజీ గురించి పూర్తిగా తెలుసుకున్న ఎమ్మెస్వోలు సంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో కోల్పోయిన కనెక్షన్లను మళ్ళీ రాబట్టుకోగలమన్న ధీమా వ్యక్తం చేశారు. డిటిహెచ్ కంటే మెరుగైన నాణ్యతతో మెరుగైన సేవలందించగలమన్న నమ్మకం కుదిరిందని, డిటిహెచ్ నుంచి కస్టమర్లు మళ్ళీ  తమ పరిధిలోకి వస్తారని చెప్పారు. మార్కెట్లో గట్టిగా నిలదొక్కుకోవటానికి గ్రాంట్ హిట్స్ ఎంతగానో ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్దారు. చిన్న ఎమ్మెస్వోలు ఆర్థికంగా నిలదొక్కుకోవటానికి సరైన బిజినెస్ మోడల్ చూపినందుకు హిందుజా సంస్థకు కృతజ్ఞతలు తెలియజేశారు. మండలాన్ని యూనిట్ గా తీసుకొని గ్రాంట్ హిట్స్ సొల్యూషన్ అందించాలని కూడా విజ్ఞప్తి చేశారు.

గ్రాంట్ హిట్స్ స్టేట్ హెడ్ శ్రీకుమార్ ఈ అవగాహన సదస్సులో  ఎమ్మెస్వోల అనుమానాలు తీర్చటంతోబాటు వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఎమ్మెస్వోలు శ్రీనివాస్ ( మిర్యాలగూడ ), మొయినుద్దీన్, నరసింహారావు, నాగేశ్వరరావు ( సూర్యాపేట), భాస్కర్ ( నల్లగొండ), శ్రీనివాసాచారి (చౌటుప్పల్), బ్రహ్మచారి ( నూతనకల్), వినోద్ ( నాగార్జునసాగర్ ), వెంకటేశ్ ( రామన్నపేట ), నాగరాజు ( నకిరేకల్), లక్ష్మణ్ గౌడ్ ( ముకుందాపురం ), ప్రతాప్ రెడ్డి (నాంపల్లి), శ్రీనివాస్ ( సంస్థాన్ నారాయణపూర్ ) తోబాటు అనేకమంది గ్రామీణ ఎమ్మెస్వోలు పాల్గొని ప్రసంగించారు.