• Home »
  • BARC »
  • నెం.1 ఈటీవీ, నాలుగో రాంకులో మా టీవీ: రేటింగ్స్ రాంకుల్లో నాలుగు స్తంభాలాట

నెం.1 ఈటీవీ, నాలుగో రాంకులో మా టీవీ: రేటింగ్స్ రాంకుల్లో నాలుగు స్తంభాలాట

గతవారం అనూహ్యంగా నెంబర్ వన్ స్థానంలోకి దూసుకొచ్చిన జెమిని టీవీ ఈ వారం రెండో స్థానానికి చేరింది. కొన్ని నెలలుగా వెనుకబడిన ఈటీవీ తాజా రేటింగ్స్ లో నెంబర్ వన్ అయింది. నెలలతరబడి నెంబర్ వన్ గా ఉన్న జీ తెలుగు గతవారం రెండో స్థానంలోకి, ఈ వారం మూడో స్థానం లోకి వెళ్ళిపోయింది. స్టార్ చేతిలోకి వెళ్ళినప్పటినుంచి వెనుకబడిమ మాటీవీ సినిమా అవార్డుల పుణ్యమా అని రెండు వారాల కిందట నెంబర్ వన్ స్థానం దక్కించుకున్నప్పటికీ మళ్ళీ తన యథాస్థానానికే చేరుకుంది. తాజా రేటింగ్స్ లో నాలుగో రాంకుకే పరిమితమైంది.

జులై16- 22 మధ్య సాగిన 29 వ వారానికి  బ్రాడ్ కాస్ట్ ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్ బార్క్ వెల్లడించిన తాజా ఫలితాల ప్రకారం ఈ టీవీ (416054 )  నెంబర్ వన్ స్థానంలో ఉండగా జెమిని టీవీ (405922 ) రెండో స్థానంలోను, జీ తెలుగు (389009) మూడో స్థానంలోను, మా టీవీ (378157 ) నాలుగో స్థానంలోను ఉన్నాయి. జెమిని టీవీ గత వారం కంటే మెరుగైన ఫలితాలు దక్కించుకున్నప్పటికీ రెండో రాంకుకే పరిమితం కావాల్సి వచ్చింది. అయితే, ఈ సారి ఈటీవీ, జెమినీ టీవీ రెండో జాతీయ స్థాయిలో టాప్ టెన్ చానల్స్ జాబితాలో చోటు దక్కించుకున్నాయి.