• Home »
  • BARC »
  • కొద్దిపాటి ఆధిక్యంతో ఈటీవీ నెం.1, ఆ తరువాత జీ తెలుగు, మా, జెమిని

కొద్దిపాటి ఆధిక్యంతో ఈటీవీ నెం.1, ఆ తరువాత జీ తెలుగు, మా, జెమిని

రెండు వారాలపాటు కోల్పోయిన మొదటి స్థానాన్ని ఈటీవీ ఎట్టకేలకు మళ్ళీ దక్కించుకుంది. రెండువారాలూ నెం.1 స్థానంలో ఉంటూ వచ్చిన జీ తెలుగు కొద్దిపాటి తేడాతో రెండో స్థానానికి పరిమితమైంది. మా టీవీ కూడా గట్టిపోటీ ఇచ్చి మూడో స్థానంలో ఉండిపోగా జెమిని టీవీ గతంలో కంటే ప్రేక్షకాదరణపరంగా మెరుగుపడినా నాలుగో రాంకుతో సరిపెట్టుకుంది. జెమినీ మూవీస్ కి ఐదో స్థానం లభించింది.

బ్రాడ్ కాస్ట్ ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్ ( బార్క్ ) ఏప్రిల్ 2-8 తేదీల మధ్య సాగిన వారానికి అందించిన డేటా ప్రకారం తెలుగు చానల్స్ లో వరుసగా ఈటీవీ (409782 వేలు ) , జీ తెలుగు (398788 వేలు), మా టీవీ (392493 వేలు), జెమిని (338823 వేలు), జెమిని మూవీస్ (167823 వేలు ) సంపాదించుకున్నాయి.