ప్రైమ్ టైమ్ లో ఈటీవీకే ఆదరణ

తెలుగు చానల్స్ లో నెంబర్ వన్ స్థానంలో ఉండటమే కాకుండా ప్రైమ్ టైమ్ కార్యక్రమాల్లోనూ ఈటీవీ ముందుంది. 2016 నాలుగవ వారానికి గాని బ్రాడ్ కాస్ట్ ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్ ( బార్క్ ) అందజేసిన సమాచారం ప్రకారం ఈ టీవీ లో ప్రసారమయ్యే మనసు మమత, స్వాతి చినుకులు సీరియల్స్ మొదటి రెండు స్థానాల్లో ఉండటమే కాకుండా ఈటీవీ లో ప్రసారమయ్యే ఎక్స్ ట్రా జబర్దస్త్ మూడో స్థానం దక్కించుకుంది.

జీ తెలుగు చానల్ లో ప్రసారమయ్యే సీరియల్ వరూధినీ పరిణయం నాలుగో స్థానంలో ఉండగా మా టీవీలో ప్రసారమైన కంచె చలన చిత్రం ఐదో ర్యాంక్ సంపాదించుకుంది. మా టీవీలో ప్రతిష్ఠాత్మకంగా భావించే మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమం టాప్ 5 జాబితాలో స్థానం దక్కించుకోలేకపోయింది.