• Home »
  • BARC »
  • 2015 చివరి వారంలో నెం.1 ఈటీవీ

2015 చివరి వారంలో నెం.1 ఈటీవీ

ఈటీవీ మళ్ళీ తన మొదటి స్థానాన్ని తిరిగి సాధించుకుంది. కొన్నివారాలుగా నెంబర్ వన్ స్థానంలోనే ఉన్నప్పటికీ అంతకుముందువారం నెంబర్ వన్ స్థానం దక్కించుకున్న మాటీవీ ని వెనక్కి నెట్టి తన నెంబర్ వన్ స్థానాన్ని మళ్ళీ తెచ్చుకోగలిగింది. దీంతో 2015 సంవత్సరం ఆఖరివారానికి ఈటీవీ నెంబర్ వన్ అయింది.

మా టీవీ కంటే దాదాపు 20 శాతం ఆధిక్యం ప్రదర్శించటం మరో విశేషం. మా టీవీ రెండో స్థానం దక్కించుకోగా,  జీ తెలుగు మూడో స్థానంలో నిలిచింది. జెమినీ టీవీ నాలుగో స్థానానికే పరిమిత మైనప్పటికీ దాని సోదర చానల్ అయిన జెమినీ మూవీస్ కూడా గణనీయంగా రేటింగ్స్ సంపాదించుకొని ఐదో స్థానం దక్కించుకుంది.