• Home »
  • BARC »
  • ఈటీవీ నెం.1, ప్రోగ్రామ్స్ లో 2వస్థానంలో జెమిని ఐఐఎఫ్ఎ అవార్డులు

ఈటీవీ నెం.1, ప్రోగ్రామ్స్ లో 2వస్థానంలో జెమిని ఐఐఎఫ్ఎ అవార్డులు

ఫిబ్రవరి 27- మార్చి4 తేదీల మధ్య సాగిన 9 వవారంలోనూ తెలుగు చానల్స్ లో ఈటీవీ తన మొదటి స్థానాన్ని కొనసాగించింది. జీతెలుగు, మా టీవీ, జెమిని కూడా రాంకుల పరంగా ఎలాంటి మార్పూ కనబరచలేదు. జీ తెలుగు రెండో స్థానంలో, దానికి బాగా దగ్గర్లో మాటీవీ ఉండగా నెం.1 అయిన ఈటీవీ కంటే 25% తక్కువ రేటింగ్స్ తో జెమిని నాలుగో స్థానంలో ఉంది. అయితే, ఐదో రాంకులో ఉన్న జెమినీ మూవీస్ వలన జెమిని గ్రూప్ కొంతమేరకు మెరుగైన స్థితిలో ఉండగలిగింది.

ఇక కార్యక్రమాల విషయానికికొస్తే, ప్రైమ్ టైమ్ లో అత్యధిక ప్రేక్షకాదరణ పొందిన కార్యక్రమంగా ఈటీవీలో ప్రసారమయ్యే మనసు-మమత సీరియల్ కొనసాగుతూ వస్తోంది. జెమిని లో ప్రసారమైన ఇంటర్నేషనల్ ఇండియా ఫిల్మ్ అవార్డ్స్  (ఐఐఎఫ్ఎ 2016)  రెండో స్థానంలో నిలిచింది. మూడో స్థానం తిరిగి ఈటీవీ సీరియల్ స్వాతి చినుకులు సంపాదించుకోగా జీ తెలుగు సీరియల్స్ ముద్ద మందారం, వరూధినీ పరిణయం వరుసగా నాలుగు, ఐదు స్థానాలు దక్కించుకున్నాయి. టాప్ 5 లో ఉంటూ వచ్చిన జబర్దస్త్ ఈ సారి టాప్ ఫైవ్ నుంచి వైదొలగాల్సి వచ్చింది.