• Home »
  • BARC »
  • తెలుగు చానల్స్ లో నెం.1 ఈటీవీ : తరువాత రాంకుల్లో జీ, మా, జెమిని

తెలుగు చానల్స్ లో నెం.1 ఈటీవీ : తరువాత రాంకుల్లో జీ, మా, జెమిని

మార్చి 5 వ తేదీ నుంచి 11 వరకు నడిచిన 10 వ వారంలోనూ ఈటీవీ మొదటి స్థానం నిలబెట్టుకుంటూ వచ్చింది. బ్రాడ్ కాస్ట్ ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్)  అందించిన తాజా సమాచారం ప్రకారం ఈటీవీ నెంబర్ వన్ స్థానంలోనే  కొనసాగుతూ ఉండగా ఆ తరువాత స్థానాల్లో ఉన్న చానల్స్ రాంకుల్లోనూ తేడా లేదు. జీ తెలుగు రెండో స్థానంలో, మా టీవీ మూడో స్థానంలో, జెమిని టీవీ నాలుగో స్థానంలో ఉన్నాయి. కొద్దివారాలుగా ఈ వరుస క్రమం ఇదే విధంగా కొనసాగుతోంది.

తమిళంలో నెంబర్ వన్ గా సన్ టీవీ కొనసాగుతుండగా మలయాళంలో ఏషియానెట్, కన్నడలో కలర్స్ కన్నడ, మరాఠీ లో జీ మరాఠీ ఆధిక్యాన్ని కాపాడుకుంటూ వస్తున్నాయి. ఒడియాలో సార్థక్, భోజ్ పురి లో బిగ్ గంగ, బంగ్లా లో స్టార్ జల్సా నెంబర్ వన్ స్థానంలో ఉన్నాయి. గత వారంలో కూడా ఈ చానల్స్ ఇవే రాంకులలో కొనసాగాయి.