• Home »
  • BARC »
  • ఈవారం టాప్5 లో చోటుదక్కని జబర్దస్త్, ఈటీవీ సీరియల్స్ దే అగ్రస్థానం

ఈవారం టాప్5 లో చోటుదక్కని జబర్దస్త్, ఈటీవీ సీరియల్స్ దే అగ్రస్థానం

బ్రాడ్ కాస్ట్ ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్ ( బార్క్ ) ఈ ఏడాది 14 వ వారానికి ( ఏప్రిల్2-8) ప్రకటించిన ప్రేక్షకాదరణ సమాచారం ప్రకారం తెలుగు చానల్స్ లో టాప్ 5 కార్యక్రమాల్లో ఈటీవీ సీరియల్స్ ఆధిక్యం కనబరచాయి. మొదటి రెండు రాంకులతోబాటు నాలుగో స్థానం కూడా దక్కించుకోవటం ద్వారా టాప్ 5 లో మూడు రాంకులు సంపాదించుకున్నట్టయింది.  అదే సమయంలో 3,5 రాంకులు జీ తెలుగు పరమయ్యాయి. చాలా కాలం తరువాత ’ జబర్దస్త్ ’  టాప్ 5 జాబితా నుంచి వైదొలగింది.

తాజా సమాచారం ప్రకారం ఈటీవీ వారి స్వాతి చినుకులు (5667 వేలు), మనసు- మమత ( 5465 వేలు) మొదటి రెండు రాంకుల్లో ఉండగా జీ తెలుగు సీరియల్ ముద్ద మందారం ( 5134 వేలు ) మూడో స్థానం సంపాదించుకుంది.  ఈటీవీ సీరియల్ నా పేరు మీనాక్షి ( 5019 వేలు ), జీ తెలుగు సీరియల్ రామా సీత (4874 వేలు) ఆ తరువాత 4,5 రాంకులు తెచ్చుకున్నాయి.  దీంతో జబర్దస్త్ కు స్థానం లేకుండా పోయింది.