• Home »
  • BARC »
  • ప్రైమ్ టైమ్ లో ముందున్న ఈటీవీ సీరియల్స్, టాప్ 5 లో జబర్దస్త్ పదిలం

ప్రైమ్ టైమ్ లో ముందున్న ఈటీవీ సీరియల్స్, టాప్ 5 లో జబర్దస్త్ పదిలం

మార్చి 19-25 మధ్య వారంలో తెలుగులో అత్యంత ప్రేక్షకాదరణ పొందిన చానల్ గా జీ తెలుగు నిలిచినప్పటికీ ప్రైమ్ టైమ్ సీరియల్స్ లో మాత్రం ఈటీవీ తన ఆధిపత్యాన్ని చాటుకుంది. మనసు మమత నెంబర్ వన్ సీరియల్ గా, స్వాతి చినుకులు నెంబర్ టూ సీరియల్ గా ఆదరణ పొందాయని బార్క్ డేటా తెలియజేస్తోంది.

మూడో రాంకులో జీ తెలుగు సీరియల్ గా ముద్దమందారం ఉండగా ఐదో రాంకులోనూ జీ తెలుగు చానల్ సీరియల్ రామ సీత నిలిచింది. గతవారం పోటాపోటీగా ఉన్నప్పటికీ ఈ వారం ఈటీవీ సీరియల్స్ ఆధిపత్యమే సాగింది. వరుసగా జబర్దస్త్ మాత్రం నాలుగో స్థానంలో కొనసాగుతూనే వస్తోంది.