నెం.1 స్థానంలోకి ఈటీవీ

జనవరి 27- ఫిబ్రవరి 2 తేదీల మధ్య నడిచిన ఐదవ వారంలో ఈటీవీ అత్యధిక ప్రేక్షకాదరణతో నెంబర్ వన్ స్థానంలోకి దూసుకొచ్చింది. కొద్దితేడాతో స్టార్ మా రెండో స్థానంలో ఉండగా జెమిని టీవీ మూడో స్థానానికి, జీ తెలుగు నాలుగో స్థానానికి పరిమితమయ్యాయి.

గతవారం మొదటి స్థానంలో ఉన్న మా టీవీ ఈ సారి రేటింగ్స్ తగ్గటంతో రెండో స్థానంలోకి వెళ్ళింది. అయితే ముందువారం మూడో స్థానానికే పరిమితమైన ఈ టీవీ మాత్రం నెంబర్ వన్ స్థానానికి ఎదిగింది. అదే విధంగా జెమిని టీవీ రెండో రాంకు నుంచి మూడో రాంకుకు పడిపోయింది. జీ తెలుగు అదే నాలుగో స్థానం కొనసాగిస్తోంది.

రాంకు చానల్ ఈ వారం వీక్షణలు (వేలల్లో) ముందువారం వీక్షణలు

( వేలల్లో)

1 ఈటీవీ తెలుగు 484323 480695
2 స్టార్ మా 471210 499666
3 జెమిని టీవీ 450884 495815
4 జీ తెలుగు 418073 461962