• Home »
  • BARC »
  • 7వ వారంలోనూ ఈటీవీ నెం.1, తరువాత స్థానాల్లో జీ తెలుగు, మా, జెమిని

7వ వారంలోనూ ఈటీవీ నెం.1, తరువాత స్థానాల్లో జీ తెలుగు, మా, జెమిని

ఫిబ్రవరి 13 నుంచి 19 వరకు సాగిన ఏడవ వారంలో కూడా ఈటీవీ తన మొదటి స్థానాన్ని నిలబెట్టుకుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో నాలుగేళ్ళు పైబడిన అందరి ప్రేక్షకుల ప్రేక్షకాదరణ సమాచారం ఆధారంగా ఈ లెక్కింపు జరిగింది. ఇందులో పట్టణ ప్రాంత ప్రేక్షకులతోబాటు గ్రామీణ ప్రాంత ప్రేక్షకులు కూడా ఉన్నారు.

ఈటీవీ నెంబర్ వన్ కాగా , జీ తెలుగు చానల్ కు రెండో స్థానం దక్కింది. ఆ తరువాత మా టీవీ మూడో రాంకుకు పరిమితం కాగా జెమిని టీవీ అంతకుముందు వారాల్లాగానే నాలుగో స్థానానికి పరిమితం కావాల్సి వచ్చింది. ఆ తరువాత స్థానం జెమిని మూవీస్ కి దక్కింది.