• Home »
  • MIB/Licencing »
  • మీడియాలో విదేశీ ప్రత్యక్షపెట్టుబడుల పరిమితి 49శాతానికి పెంపు?

మీడియాలో విదేశీ ప్రత్యక్షపెట్టుబడుల పరిమితి 49శాతానికి పెంపు?

మీడియాలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 49 శాతానికి పెంచాలని ప్రభుత్వం తీవ్రంగా ఆలోచిస్తున్నది. మొత్తం విదేశె ప్రత్యక్ష పెట్టుబడుల విధానాన్నే హేతుబద్ధం చేయాలని ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు రక్షణ, రైల్వేలు, మీడియాలాంటి రంగాల విషయంలో ఆచితూచి అడుగేస్తున్నప్పటికీ తాజా పరిణామాలను బట్టి ప్రభుత్వం కీలకమైన నిర్ణయాలు తీసుకోవటానికి సిద్ధమవుతున్నట్టు అర్థమవుతోంది.

న్యూస్ చానల్స్ తో బాటు ప్రింట్ మీడియంలో కూడా వ్యూహాత్మక భాగస్వాములను ఆహ్వానించేందుకు వీలుకల్పిస్తూ పరిమితిని పెంచటమే మంచిదనే అభిప్రాయంలో ప్రభుత్వముంది. అయితే, నియంత్రణ మాత్రం భారత భాగస్వాముల చేతుల్లోనే ఉండేలా కనీసం 51 శాతం భారతీయుల వాటా ఉండేట్టు జాగ్రత్త తీసుకోవాలని కూడా ప్రభుత్వం ఆలోచిస్తోంది. న్యాయమంత్రిత్వశాఖ సూత్రప్రాయంగా ఆమోదం తెలియజేసింది. ప్రభుత్వం దీనికి ఆమోద ముద్ర వేస్తే మీడియాలో పెనుమార్పులు వస్తాయని భావిస్తున్నారు.